News August 24, 2025
ఖైరతాబాద్ మహాగణపతికి స్వాగతం చెప్పేందుకు సిద్ధం

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఘన స్వాగతం చెప్పేందుకు నగర భక్తులు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం 69 అడుగుల గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. సోమవారం నేత్రోనిలం(కంటిపాప అమర్చడం) అనంతరం ఏకదంతుడికి స్వాగత కార్యక్రమలు ప్రారంభమవుతాయి. సాయంత్రం గణపతి ఆగమన్ నిర్వహించేందుకు ఖైరతాబాద్ యూత్ అసోసియేషన్ సిద్ధంగా ఉంది. 11 రోజుల పాటు మహాగణపతికి నగరవాసులను కనువిందు చేయనున్నాడు.
Similar News
News August 25, 2025
HYD మొత్తం వేరు.. జూబ్లీహిల్స్‌లో కథ వేరు

నగరం మొత్తం వినాయక చవితి వేడుకల్లో మునిగి ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాత్రం రాజకీయ కార్యకలాపాల్లో బిజీ బిజీగా ఉంది. ఇక్కడ ఏ పార్టీ నాయకుడు కలిసినా ‘మనకు ఎన్ని ఓట్లు వస్తాయి..’ అనే అడుగుతున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో ఆత్మీయ సమ్మేళనాలు, దావత్‌లు ఘనంగా జరిపేందుకు ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సమ్మేళనాల బాధ్యతలు స్థానిక నాయకులకు అప్పగించి వారి ఓటు బ్యాంకును పటిష్ఠం చేసుకునే పనిలోపడ్డారు.
News August 25, 2025
జూబ్లీహిల్స్: కులాల లెక్కలు.. మంత్రులకు బాధ్యతలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కులాల లెక్కలను తీస్తోంది. ఏయే సామాజికవర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయనే విషయంపై పకడ్బందీగా ఆరా తీస్తోంది. అందుకే వివిధ సామాజికవర్గాలకు చెందిన మంత్రులను ఇన్‌ఛార్జీలుగా నియమించి ఓటుబ్యాంకు పక్కకు పోకుండా ప్రయత్నిస్తోంది. మంత్రులు పొన్నం(బీసీ), గడ్డం వివేక్(ఎస్సీ), తుమ్మల(ఓసీ)లకు బాధ్యతలు అప్పగించి అందరినీ సమన్వయపరుస్తూ విజయానికి పక్కా ప్రాణాళిక రచిస్తోంది.
News August 25, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఆ ముగ్గురి గురించి ఆరా?

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతి అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకులు టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు. బీసీ రిజర్వేషన్ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు బీసీ నాయకుల గురించే గాంధీ భవన్‌లో చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. బీసీ నాయకులైన విద్యావేత్త భవాని శంకర్, నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్‌లలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. వీరు ఎవరికి వారు ఢిల్లీ నేతలతో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.