News August 24, 2025

హైదరాబాద్‌లో కాసేపట్లో వర్షం!

image

TG: హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం/రాత్రి వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో జల్లులు పడే ఛాన్స్ ఉందని, గంటకు 30-40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అక్కడక్కడా సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు వర్షాలకు అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Similar News

News January 23, 2026

అర్ష్‌దీప్ బౌలింగ్.. 2 ఓవర్లలోనే 36 రన్స్

image

భారత్‌తో రెండో టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు అర్ష్‌దీప్ వేసిన రెండు ఓవర్లలో 36 రన్స్ బాదారు. తొలి ఓవర్లో కాన్వే 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 18 పరుగులు, 3 ఓవర్లో సీఫెర్ట్ చివరి 4 బంతుల్లో 4 ఫోర్లు బాదారు. 4వ ఓవర్‌ను హర్షిత్ మెయిడెన్ వేసి కాన్వే వికెట్ తీశారు. ఐదో ఓవర్లో వరుణ్ చక్రవర్తి 2 పరుగులిచ్చి సీఫెర్ట్‌ను ఔట్ చేశారు. అయితే హర్షిత్ వేసిన 6వ ఓవర్‌లో 19 పరుగులొచ్చాయి. 6 ఓవర్లకు NZ స్కోర్ 64/2.

News January 23, 2026

విచారణలో రాధాకిషన్ ఎంట్రీ..? KTR రిప్లై ఇదే!

image

TG: ఫోన్ ట్యాపింగ్‌పై తనను విచారించే సమయంలో మాజీ DCP రాధాకిషన్‌ రావును పిలిపించారనేది అవాస్తవమని KTR స్పష్టం చేశారు. ‘అక్కడ తారకరామారావు తప్ప మరే రావు లేడు. ప్రభుత్వం కుట్రతో ఇచ్చే ఇలాంటి లీకులను మీడియా వెరిఫై చేయకుండా ప్రజలకు చెప్పవద్దు’ అని కోరారు. కాగా SIT ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ అంతా అధికారులే చూసుకున్నారని KTR చెప్పడంతో రాధాకిషన్‌ను రప్పించి ఎదురెదురుగా విచారించారని ప్రచారం జరిగింది.

News January 23, 2026

‘హంద్రీనీవా’కు 40TMCల నీరు…CMకు థాంక్స్

image

AP: హంద్రీనీవా విస్తరణకు కృషిచేసి రాయలసీమకు నీళ్లందించారని CM CBNకు
మంత్రులు కేశవ్, జనార్దన్, MLA కాల్వ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. 190 రోజుల్లో 40 TMCల నీటిని విడుదల చేసి రికార్డు సృష్టించినట్లు చెప్పారు. 2014-19 మధ్య 6 పంపులుండగా ఇపుడు 100 రోజుల్లో 12 పంపుల సామర్థ్యానికి పెంచడంతో ఇది సాధ్యమైందన్నారు. కాగా మార్చి నాటికి 50 TMCలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మలకు CM సూచించారు.