News August 24, 2025
98% మంది డాక్యుమెంట్లు సమర్పించారు: ECI

బిహార్‌లో ఓటర్ లిస్ట్‌కు సంబంధించి 98.2% మంది ఓటర్లు డాక్యుమెంట్లు సమర్పించారని భారత ఎన్నికల సంఘం(ECI) వెల్లడించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అనంతరం రూపొందించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌పై అభ్యంతరాలతో పాటు సర్వే సమయంలో ఇవ్వని డాక్యుమెంట్లను సమర్పించేందుకు EC అవకాశమిచ్చింది. ఇందులో భాగంగా జూన్ 24 నుంచి ఇప్పటివరకు 98.2% మంది డాక్యుమెంట్లు సమర్పించారని, మరో 8 రోజుల గడువు ఉందని తెలిపింది.
Similar News
News August 25, 2025
ALERT: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. <
News August 25, 2025
ఒకే జిల్లా పరిధిలోకి అసెంబ్లీ సెగ్మెంట్స్!

TG: జనాభా లెక్కల అనంతరం కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టనున్న విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు జిల్లాలకు తగ్గట్టు సరిహద్దులు మారనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 38 సెగ్మెంట్లు 2, 3 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత వీటితో పాటు కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు సైతం ఒకే జిల్లా పరిధిలోకి రానున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయి.
News August 25, 2025
వీళ్లు భర్తలు కాదు.. నరరూప రాక్షసులు

TGలో పలువురు భర్తల వరుస దురాగతాలు ఉలిక్కిపడేలా చేశాయి. HYDలో అనుమానంతో 4 నెలల గర్భవతైన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి చంపి, ముక్కలు చేసి మూసీలో పడేశాడు. అదే అనుమానంతో నాగర్‌కర్నూల్(D) పెద్దకొత్తపల్లిలో భార్య శ్రావణిని భర్త శ్రీశైలం హత్య చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కొత్తగూడెంలో లక్ష్మీప్రసన్నను రెండేళ్లుగా కడుపు మాడ్చి చంపేయగా, వరంగల్‌లో భార్య గౌతమిని భర్త ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.