News August 24, 2025

వచ్చే ఏడాది నుంచి నేచర్ క్యూర్ వైద్య కళాశాలలో అడ్మిషన్లు

image

AP: విశాఖలోని తొలి నేచర్ క్యూర్ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు మొదలవుతాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. విశాఖ, కాకినాడలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయన్నారు. విశాఖలోనే ఆయుర్వేద మందుల తయారీ, నాణ్యత పరీక్షల ప్రయోగశాల రాబోతోందని వెల్లడించారు. కళాశాల పక్కనే 50 పడకలతో చేపట్టిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి నిర్మాణం కూడా చివరి దశలో ఉన్నట్లు తెలిపారు.

Similar News

News August 25, 2025

ఓయూకు చేరుకున్న సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర సీఎం ఓయూకు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన పర్యటన నేపథ్యంలో నిరసనకు దిగుతారన్న సమాచారంతో బీఆర్ఎస్వీ, ఏబీవీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వర్సిటీ పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

News August 25, 2025

హోటల్‌కు రమ్మన్నాడన్న నటి.. MLA సస్పెండ్

image

కేరళ కాంగ్రెస్ నేత తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి హోటల్‌కు రమ్మన్నాడంటూ మలయాళ నటి రిని ఆన్ జార్జ్ <<17471989>>ఆరోపించిన<<>> విషయం తెలిసిందే. ఆమెను వేధించింది MLA రాహుల్ మమ్‌కూటతిల్ అంటూ BJP ఆందోళన ఉద్ధృతం చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. పార్టీ ఒత్తిడితో అతడు అంతకుముందే కేరళ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు.

News August 25, 2025

డ్రీమ్-11తో ఒప్పందం రద్దైంది: BCCI కార్యదర్శి

image

డ్రీమ్11తో స్పాన్సర్షిప్ ఒప్పందం రద్దు చేసుకున్నట్లు BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ చట్టం అమలులోకి వచ్చాక డ్రీమ్11తో ఒప్పందం రద్దు చేసుకున్నాం. ఇకపై భవిష్యత్తులో అలాంటి సంస్థలతో బీసీసీఐ ఎలాంటి ఒప్పందాలు చేసుకోదు’ అని స్పష్టం చేశారు. దీంతో ఆసియాకప్‌లో టీమ్‌ఇండియా మెయిన్ స్పాన్సర్ లేకుండానే ఆడే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.