News August 24, 2025

ఒంగోలు రాజకీయాలు.. 2 రోజుల్లో క్లారిటీ

image

ఒంగోలు టీడీపీ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. అలాగే పార్లమెంట్ కమిటీ ఏర్పాటుకై అధిష్ఠానం నియమించబడ్డ ప్రతినిధులు సైతం సమావేశంలో పాల్గొన్నారు. అయితే అధ్యక్ష పదవికి ముగ్గురు ఎమ్మెల్యేలు, మరొకరు నామినేటెడ్ పోస్ట్ గల ప్రతినిధి పోటీలో ఉన్నట్లు సమాచారం. 2 రోజుల్లో టీడీపీ అధిష్ఠానం పార్లమెంట్ కమిటీని ప్రకటించనుంది.

Similar News

News August 25, 2025

శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్

image

ప్రకాశం జిల్లా పునర్విభజన నేపథ్యంలో తెరపైకి సరికొత్త డిమాండ్ వచ్చింది. శ్రీశైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని కోరుతూ సంతకాలు సేకరించారు. ‘మార్కాపురానికి దగ్గర శ్రీశైలం ఉంది. ఇక్కడి గిరిజనులకు మార్కాపురంతో అనుబంధం ఉంది. వెలిగొండ, శ్రీశైలం ప్రాజెక్టులతో భవిష్యత్తులో నీటి వివాదాలు వస్తాయి. వీటికి పరిష్కారంగా శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలి’ అని TDP నేత కందుల రామిరెడ్డి కోరారు.

News August 25, 2025

మర్రిపూడి: గ్రామం ఒకటే.. పంచాయతీలు రెండు

image

మర్రిపూడి మండలంలో ఓ ఊరు రెండు పంచాయతీల్లో ఉంటోంది. ఈ రెండు పంచాయతీల మధ్య పొదిలి కొండపి రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డుకు తూర్పు వైపున జువ్విగుంట, పడమర వైపు రావెళ్లవారిపాలెం పంచాయతీలు ఉన్నాయి. పొదిలి వైపు వెళ్లే వాళ్లు రావెళ్లవారిపాలెంలో బస్సు ఎక్కాలి. అదే బస్సు రిటర్న్‌లో ఆ గ్రామంలో దిగాలంటే జువ్విగుంటలో దిగాలి.

News August 25, 2025

కనిగిరి: నాన్నమ్మ అండతో జిల్లా ఫస్ట్ ర్యాంక్

image

కనిగిరి మండలం పాలూరివారిపల్లికి చెందిన లావణ్య డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటింది. ఆమెది నిరుపేద కుటుంబం. లావణ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. పాలూరివారిపల్లిలోని నాయనమ్మ వద్దనే ఉంటూ కష్టపడి చదివింది. SGTలో ప్రకాశం జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించింది. పేదరికాన్ని జయించేలా ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో లావణ్యను పలువురు అభినందించారు.