News August 24, 2025
సెప్టెంబర్ 6 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: పౌరసరఫరాల శాఖ

సెప్టెంబర్ 6వ తేదీ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ బియ్యం కార్డులు పంపిణీకి రంగం సిద్ధం చేసినట్లు కోనసీమ జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమలులోనికి తీసుకుని వచ్చిందన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా లబ్దిదారులకు పంపిణీ చేసిన రేషన్ గుర్తింపు కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి సన్నాహాలు చేసిందన్నారు.
Similar News
News August 25, 2025
త్వరలో మదనపల్లె జిల్లా ప్రకటన..?

మదనపల్లె జిల్లా ఏర్పాటుపై త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా అధికారులు పనిచేస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. జిల్లా హద్దులపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారంట. మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లెతో కలిపి నూతన జిల్లాగా ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ రానుంది.
News August 25, 2025
మర్రిపూడి: గ్రామం ఒకటే.. పంచాయతీలు రెండు

మర్రిపూడి మండలంలో ఓ ఊరు రెండు పంచాయతీల్లో ఉంటోంది. ఈ రెండు పంచాయతీల మధ్య పొదిలి కొండపి రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డుకు తూర్పు వైపున జువ్విగుంట, పడమర వైపు రావెళ్లవారిపాలెం పంచాయతీలు ఉన్నాయి. పొదిలి వైపు వెళ్లే వాళ్లు రావెళ్లవారిపాలెంలో బస్సు ఎక్కాలి. అదే బస్సు రిటర్న్‌లో ఆ గ్రామంలో దిగాలంటే జువ్విగుంటలో దిగాలి.
News August 25, 2025
ఎమ్మెల్యే కళా వెంకట్రావు సోదరడి మృతి

చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నయ్య నీలం నాయుడు (75) అనారోగ్య కారణంగా సోమవారం ఉదయం రేగిడిలో మృతి చెందారు. ఈయన గతంలో రేగిడి గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. స్వస్థలం రేగిడిలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నీలం నాయుడు మృతితో రేగిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.