News August 24, 2025

రష్యా న్యూక్లియర్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ అటాక్

image

ఓ వైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ తమ ఇండిపెండెన్స్ డే వేళ రష్యాలోని భారీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై అటాక్ చేసింది. దీంతో ఫ్యూయెల్ టెర్మినల్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. కనీసం 95 ఉక్రెయినియన్ డ్రోన్స్‌ను కూల్చేశామని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. రేడియేషన్ లెవెల్ నార్మల్‌గానే ఉందని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది.

Similar News

News August 25, 2025

భూదాన్ భూముల అన్యాక్రాంతంపై సీఎం సీరియస్

image

TG: యాచారంలో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. 250 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణ, ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద పరిహారం పొందిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని రెవెన్యూ సెక్రటరీకి సూచించారు.

News August 25, 2025

KGF నటుడు కన్నుమూత

image

KGF మూవీలో బాంబే డాన్‌ ‘శెట్టి’ పాత్రలో నటించిన దినేశ్ మంగళూరు కన్నుమూశారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. కాగా ఆయన నటుడిగానే కాకుండా ‘వీర మదకరి’, ‘చంద్రముఖి ప్రాణసఖి’, ‘రాక్షస’ తదితర చిత్రాలతో ఆర్ట్ డైరెక్టర్‌గానూ గుర్తింపు పొందారు.

News August 25, 2025

‘AA22’లో యాక్షన్ సీన్స్‌కు గూస్‌బంప్స్ పక్కా!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తోన్న ‘AA22’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ బన్నీ కెరీర్‌లో హైలైట్‌గా నిలుస్తాయని సినీవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుందని సమాచారం. అలాగే ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.