News August 24, 2025

బీసీ రిజర్వేషన్లు.. గాంధీభవన్ కీలక నిర్ణయం ?

image

రాష్ట్రంలో ఇపుడు ఎక్కడ చూసినా 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనే సాగుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నిర్ణయంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ సీటును బీసీ అభ్యర్థికి కేటాయించి బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రజలకు చెప్పకనే చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Similar News

News August 25, 2025

HYD: 70 మంది పోకిరీల పనిపట్టిన షీ టీమ్స్

image

మహానగరంలో పోకిరీల బెడద నుంచి కాపాడాలని సైబరాబాద్ షీ టీమ్స్‌కు పలువురు ఫోన్ చేసే సహాయం అర్థిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు షీటీమ్స్ సిబ్బంది 143 డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించారు. అసభ్యకరంగా వేధిస్తున్న 70 మందిని పట్టుకున్నట్లు డీసీపీ సృజన కరణం తెలిపారు. అంతేకాక 34 మంది భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వివరించారు. బాధితులు 181, 1098కు ఫోన్ చేసి చెప్పాలని ఈ సందర్భంగా సూచించారు. 

News August 25, 2025

HYD: కార్యకర్తలతో సెల్ఫీ దిగిన KTR

image

శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్ కార్యకర్తలతో ఆత్మీయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమావేశమయ్యారు. తమ అభిమాన నాయకుడిని చూసిన కార్యకర్తలు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో కేటీఆర్ స్వయంగా వారితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్టీలో కొందరు ప్రధాన నేతలు మోసం చేసినా.. కార్యకర్తలు పార్టీని గుండెల్లో పెట్టుకుని చేసుకుంటున్నారని వారిని కీర్తించారు.

News August 25, 2025

HYD: గణేశ్ మండపాలకు ఫ్రీ కరెంట్

image

గణేశ్ మండప నిర్వాహకులకు విద్యుత్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు కనెక్షన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రేటర్‌లో గతంలో కమర్షియల్‌ కేటగిరి కింద తాత్కాలిక కనెక్షన్లు జారీ చేసి రూ.1,500 వరకు వసూలు చేసేవారు. ప్రభుత్వం ఈ నెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది.