News August 24, 2025

NZB: విద్యార్థుల కంట్లో కారం చల్లిన టీచర్ సస్పెండ్

image

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో <<17506407>>విద్యార్థుల కంట్లో కారం<<>> చల్లిన ఉపాధ్యాయుడిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు పాఠశాలలో ఆందోళన చేసి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్పందించారు. ఉపాధ్యాయుడు శంకర్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News September 7, 2025

అరకు: ‘ఆ ప్రాజెక్టుతో 150 గ్రామాలు జలసమాధి’

image

5వ షెడ్యూల్ ఏరియాలో చేపట్టాలనుకునే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాలు రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం అరకులోయ వచ్చిన రాష్ట్ర మంత్రి సంధ్యారాణికి వినతి పత్రాలు అందిచారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం డ్యాం నిర్మిస్తే అనంతగిరి, హుకుంపేట, అరకులోయ మండలాల్లో సుమారు 150 గిరిజన గ్రామాలు జలసమాధి అవుతాయని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు.

News September 7, 2025

KNR: మంత్రులూ.. జర రైతులను పట్టించుకోండి..!

image

ఉమ్మడి KNR జిల్లాలో ఓ పక్క భారీ వర్షాలతో పంట నష్టం, మరోపక్క యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతకు అండగా ఉంటూ భరోసా కల్పించాల్సిన మంత్రులు ఎక్కడున్నారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంట పరిహారం ఎప్పుడు ఇస్తారు? యూరియా కష్టాలు ఎప్పుడు తీరుస్తారు? అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా పట్టించుకోండంటూ వేడుకుంటున్నారు.

News September 7, 2025

పెదతాడేపల్లి గురుకుల పాఠశాల పీజీటీ సస్పెండ్

image

తాడేపల్లిగూడెం (M) పెదతాడేపల్లి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పీజీటీ భీమడోలు రాజారావును జిల్లా కలెక్టర్ నాగరాణి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు చెందిన బ్యాగ్ పైపర్ బ్యాండ్ విద్యార్థుల బృందాన్ని నరసాపురంలోని ఒక ప్రైవేట్ కళాశాలకు తీసుకెళ్లినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే, జిల్లా కోఆర్డినేటర్ ఉమా కుమారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.