News August 24, 2025
మూడు రోజులు భారీ వర్షాలు!

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా-ప.బెంగాల్‌కు ఆనుకొని రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారముందని తెలిపింది.
Similar News
News August 25, 2025
మళ్లీ ఓయూకు వస్తా.. ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడతా: రేవంత్

TG: డిసెంబర్‌లో మరోసారి తాను ఓయూకు వస్తానని CM రేవంత్ ప్రకటించారు. ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెట్టి, వర్సిటీకి రూ.వందల కోట్ల నిధులు ఇస్తానన్నారు. ఆరోజు ఒక్క పోలీస్ కూడా క్యాంపస్‌లో ఉండొద్దని DGPని ఆదేశించారు. నిరసన తెలిపే విద్యార్థులకు ఆ స్వేచ్ఛ కల్పిస్తానని తేల్చి చెప్పారు. తాను రావొద్దనే ఆలోచన ఏ విద్యార్థికీ ఉండదని.. గొర్రెలు, బర్రెలు పెంచుకునేటోడికి మాత్రమే ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
News August 25, 2025
తల్లి కాబోతున్న హీరోయిన్ పరిణీతి చోప్రా

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, AAP ఎంపీ రాఘవ్ చద్దా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వీరు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ‘మా చిన్న ప్రపంచం వస్తోంది’ అని 1+1=3 అని ఉన్న ఫొటో & వీడియోతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. వీరి వివాహం సెప్టెంబర్ 2023లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
News August 25, 2025
స్టాండప్ కమెడియన్స్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

వికలాంగులను కించపరిచేలా వెకిలి వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్స్‌పై సుప్రీంకోర్టు ఫైరైంది. సమయ్ రైనా, విపుల్ గోయల్, బాల్‌రాజ్ పరమ్‌జీత్ సింగ్, నిశాంత్ జగదీశ్, సోనాలీ తక్కర్ తమ యూట్యూబ్ ఛానల్స్, SM అకౌంట్లలో ఎలాంటి షరతులు లేకుండా క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశించింది. ‘ఇతరుల మనోభావాలను దెబ్బతీయొద్దు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు.. కమర్షియల్ స్పీచ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.