News August 24, 2025
సిరిసిల్ల: సోషల్ మీడియాపై పోలీసుల ప్రత్యేక నిఘా

సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల ఎస్పీ హెచ్చరించారు. అలాంటి పోస్టులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని, వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిజానిజాలు తెలుసుకోకుండా ఎలాంటి మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టిందని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News August 25, 2025
నేటి నుంచే కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

కడప జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేటి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్యుమెంట్ల పరిశీలన చేయనున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. సోమవారం హాల్ టికెట్ నెం.4001160 నుంచి 4206930 అభ్యర్థుల డాక్యుమెంట్ల పరిశీలిస్తారు. మంగళవారం హాల్ టికెట్ నెం.4214369 నుంచి 4504062 అభ్యర్థుల వివరాలు క్రాస్ చెక్ చేస్తారు.
News August 25, 2025
ఖమ్మం: వేధిస్తున్నాడని భర్తని చితకబాదిన భార్య

మద్యం తాగి భర్త వేధిస్తున్నాడని భార్య చితకబాదిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీఎంబంజర్ గ్రామానికి చెందిన పర్వతం గంగరాజు, లక్ష్మికి 25 ఏళ్ల కిందట వివాహమైంది. భర్త రోజూ తాగి లక్ష్మిని వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక లక్ష్మి ఆదివారం భర్తను చితకబాదింది. గంగరాజుకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News August 25, 2025
విశాఖ: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. విశాఖ జిల్లాలో 5,17,149 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వలస వెళ్లిన లబ్ధిదరులు తమ కార్డును నమోదు చేసుకున్న రేషన్ దుకాణం వద్దే తీసుకోవాలన్నారు. ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది.