News August 24, 2025
అలంపూర్‌లో మెకానిక్ ఆత్మహత్య

ఓ సైకిల్ మెకానిక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అలంపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అక్బర్‌పేట కాలనీకి చెందిన ఆంజనేయులు(36) గతేడాది నుంచి డయాలసిస్‌తో బాధపడుతున్నాడు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది, శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం మృతుడి తండ్రి మునెప్ప ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదైంది.
Similar News
News August 25, 2025
అదనపు కట్నం కోసం హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు..!

తమ కూతురిని అదనపు కట్నం కోసం హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వరంగల్ హంటర్ రోడ్డులో జరిగింది. ఆటో డ్రైవర్ పని చేస్తున్న గణేశ్‌కు నాలుగు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లా వీరారం గ్రామం బాల్య తండాకు చెందిన గౌతమి(21)తో వివాహం జరిగింది. కట్నంగా రూ.20 లక్షలు ఇచ్చారు. కాగా గౌతమికి ఊపిరి ఆడక పోవడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చేసరికి గౌతమి మృతి చెందడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News August 25, 2025
సంగారెడ్డి: రేపు ఉద్యోగ మేళా

సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం సోమవారం తెలిపారు. హెచ్సీఎల్ టెక్‌బీ ఆధ్వర్యంలో మేళా జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపికైన వారికి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News August 25, 2025
పాఠశాల భవనంపై నుంచి పడిన విద్యార్థిని

రంపచోడవరం KGBV భవనంపై నుంచి పడి 10వ తరగతి విద్యార్థిని మానస గాయపడింది. తోటి విద్యార్థినులతో పాటు ఆదివారం ఆమె పాఠశాల భవనంపైకి వెళ్లింది కళ్లుతిరగడంతో భవనంపై నుంచి క్రింద పడిందని విద్యార్థినులు తెలిపారు. క్రింద ఉన్న ఇసుక గుట్టపై పడడంతో స్వల్పగాయలతో బయటపడింది. వెంటనే పాఠశాల సిబ్బంది స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారన్నారు.