News August 24, 2025
రేపట్నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: నాదెండ్ల

AP: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘1.46 కోట్ల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రేపటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. ATM కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది’ అని తెలిపారు. ‘ఇది CM చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన గొప్ప కార్యక్రమం. నాదెండ్ల మనోహర్‌కు ధన్యవాదాలు’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
Similar News
News January 23, 2026
కల్తీనెయ్యి.. ఛార్జిషీట్లో కీలక అంశాలు..

తిరుమలకు 2019-24లో కల్తీనెయ్యి సరఫరా అయినా TTD అడ్డుకోలేదని నెల్లూరు కోర్టులో ఇవాళ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జిషీట్లో CBI పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని డెయిరీ అంతకుముందు నెయ్యి సరఫరా చేయగా.. తగిన సామర్థ్యం, అనుభవం లేని AR డెయిరీకి టెండర్ దక్కేలా నిబంధనలు మార్చారని ఆరోపించింది. అటు ARకు ఇచ్చినా తెరవెనక భోలేబాబా సబ్ కాంట్రాక్ట్ పొంది నెయ్యి సప్లై చేసిందని దర్యాప్తు సంస్థ తెలిపింది.
News January 23, 2026
వరల్డ్ కప్‌కు రోహిత్ కెప్టెన్సీ? మాజీ క్రికెటర్ రెస్పాన్స్ ఇదే..

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఫెయిల్ అవుతున్నారని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. గిల్ నాయకత్వంలో AUS, NZతో జరిగిన సిరీస్‌లను భారత్ కోల్పోవడంతో అతణ్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 2027 వరల్డ్ కప్ కోసం మళ్లీ రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగించాలని BCCIకి సూచించారు. రోహిత్ ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని, ఈ మార్పు వెంటనే జరగాలని అభిప్రాయపడ్డారు.
News January 23, 2026
కల్తీనెయ్యి కేసులో CBI ఫైనల్ ఛార్జిషీట్

తిరుమల శ్రీవారి లడ్డూల్లో కల్తీనెయ్యి వ్యవహారంపై CBI నెల్లూరు కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇప్పటికే 24 మందిని నిందితులుగా చేర్చగా, మరో 12 మందిని ఇందులో చేరుస్తూ ఇవాళ అభియోగపత్రం దాఖలు చేసింది. ఛార్జిషీట్లో 11 మంది TTD ఉద్యోగులు, మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న సహా AR డెయిరీ, భోలేబాబా డెయిరీకి చెందిన కీలక వ్యక్తుల పేర్లున్నాయి.


