News August 24, 2025
ఎన్టీఆర్ జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ సెప్టెంబర్ 7న దుర్గమ్మ గుడి మూసివేత
☞ అనిగండ్లపాడులో క్షుద్ర పూజలు కలకలం
☞ వత్సవాయిలో మహిళ సూసైడ్
☞ నందిగామలో భారీ కొండచిలువ
☞ చందర్లపాడులో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
☞ నిడమానూరు వద్ద ప్రమాదం.. ఒకరి మృతి
☞ కంచికచర్లలో చేతికొచ్చిన మినప పంట.. తగ్గిన ధరలు
Similar News
News August 25, 2025
KNR: సర్కారు భవనాల్లో సౌర కాంతులు

విద్యుత్ బిల్లుల సమస్యను అధిగమించడం, సంప్రదాయ వనరుల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ఆఫీసులకు బిల్లుల భారం తగ్గించేందుకు ఈ విద్యుత్తును ఎంచుకుంది. ఇందుకోసం ఉమ్మడి KNRలో పలుచోట్ల పైలెట్ ప్రాజెక్టులను చేపట్టింది. స్థానిక విద్యుత్ AE, MPDOలకు సర్వే బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే TG NPDCL డిస్కం పరిధిలో KNR 3,169, PDPL 2,574, JGTL 3,220 సర్వీస్లను కలిగి ఉంది.
News August 25, 2025
విజయవాడలో పోలీసుల సైక్లింగ్ ర్యాలీ

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో ‘సండేస్ ఆన్ సైకిల్ విత్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్’ పేరుతో సైకిల్ ర్యాలీ జరిగింది. వ్యాస్ కాంప్లెక్స్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీని డీసీపీ ఎస్.వి.డి. ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, సంతోషకరమైన జీవనశైలి లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
News August 25, 2025
సంగారెడ్డి: ఇన్‌స్పైర్‌కు స్పందన నామమాత్రం

విద్యార్థులను భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే ఇన్‌స్పైర్ అవార్డు నామినేషన్ల పై ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. రెండు నెల క్రితం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. 2,500 మంది విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. ఇప్పటి వరకు 255 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేశారు. చివరి తేదీ సెప్టెంబర్ 15 లోపు దరఖాస్తులు చేయించాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు.