News August 24, 2025

1100కి డయల్ చేసి PGRS అర్జీ స్థితిని తెలుసుకోవచ్చు: కలెక్టర్

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని అన్నారు. అలాగే, 1100 నెంబర్‌కు నేరుగా ఫోన్ చేసి కూడా ఫిర్యాదులు, వాటి స్థితిగతులను తెలుసుకోవచ్చని తెలిపారు.

Similar News

News August 25, 2025

గుంటూరు జిల్లాలో 5,85,615 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు

image

గుంటూరు జిల్లాలోని 5,85,615 కుటుంబాలకు ఈ నెల 30 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఏటీఎమ్ కార్డు మాదిరిగా, క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ఈ కార్డులను గ్రామ సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తారు. కార్యక్రమంలో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేస్తారు. ఈ కొత్త సాంకేతిక కార్డులతో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

News August 25, 2025

ANU: ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని పర్యావరణ శాస్త్ర విభాగం & సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇకలాజికల్‌ డెవలప్‌మెంట్‌ (సీడ్‌) ఇండియా ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు 26వ తేదీ(మంగళవారం) యూనివర్సిటీ ప్రధాన ద్వారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9441812543, 9491991918 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News August 25, 2025

అమరావతిలో ఆగస్టు 29న జాబ్ మేళా

image

తుళ్లూరులోని CRDA కార్యాలయంలో ఈనెల 29న 300కు పైగా ఉద్యోగాల భర్తీకై జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని తన కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో SSC, ITI, ఇంటర్, డిగ్రీ, BSC నర్సింగ్, డిప్లొమా, PG, బీటెక్ చదివినవారు హాజరుకావొచ్చని చెప్పారు. వివరాలకు ఫెసిలిటేటర్స్ లేదా 9848424207, 9963425999 సంప్రదించాలన్నారు.