News August 24, 2025

SKLM: ‘వారి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణం’

image

గార(M) అంపోలులో దంపతుల <<17502057>>ఆత్మహత్య<<>> ఘటనపై జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. పెన్షన్ నిలిచిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఆర్డీవో, గార తహశీల్దార్‌ విచారణలో ఈ విషయం బయటపడిందన్నారు. గ్రామస్థుల వాంగ్మూలం ప్రకారం.. కుటుంబ అంతర్గత ఆస్తి, ఇంటికి సంబంధిత వివాదాలే వారి మృతికి ప్రధాన కారణమని నిర్ధారించారు.

Similar News

News August 25, 2025

ఎల్‌.ఎన్‌.పేటని శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని విజ్ఞప్తి

image

ఎల్‌.ఎన్‌.పేట మండలాన్ని జిల్లాలోనే కొనసాగించాలని స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు తీర్మానం చేశారు. సోమవారం జడ్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు విజ్ఞప్తి పత్రం అందజేశారు. టెక్కలి రెవిన్యూ డివిజన్‌కి కాకుండా శ్రీకాకుళం రెవిన్యూ డివిజన్‌ పరిధిలోనే ఉంచాలని వారు కోరారు. వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి తమ అభ్యర్థనను సమర్పించారు.

News August 25, 2025

శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 55 అర్జీలు

image

ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి వచ్చే అర్జీలు పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 55 అర్జీలు వచ్చాయన్నారు.

News August 25, 2025

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లావ్యాప్తంగా సుమారు 6,51,645 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పెద్ద సైజు కార్డులు బదులు QR కోడ్‌తో కూడిన ATM మాదిరి స్మార్ట్ రైస్ కార్డును రూపొందించారు. ఇందులో కార్డుదారుని ఫోటోతో సహా కుటుంబ సభ్యులు వివరాలు ఉంటాయి. సచివాలయా సిబ్బంది వీటిని అందజేస్తారు.