News August 25, 2025

ధర్మారం: TGRS పూర్వ విద్యార్థికి కవితా పురస్కారం

image

ధర్మారం మండలం నంది మేడారం TGRS&JC పూర్వ విద్యార్థి (SSC 2010-11) చిందం రమేష్ ఆదివారం ఖమ్మంలో ‘వురిమల్ల పద్మజ స్మారక జాతీయ కవితా పురస్కారం’ అందుకున్నారు. ఆయన రాసిన ‘విషాద కావ్యం’ కవితకు గాను జాతీయస్థాయిలో ఈ పురస్కారం లభించింది. కాగా జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన రమేష్ అదే మండలంలోని రాంనూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

Similar News

News August 25, 2025

వరంగల్: ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఎంతంటే?

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర పెరిగింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,660 ధర పలకగా.. సోమవారం రూ.7,750కి పెరిగింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

News August 25, 2025

వరంగల్: అస్తవ్యస్తంగా వీధి దీపాల నిర్వహణ..!

image

పలు గ్రామాల్లో వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణకు గాను గత ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు ఏడేళ్ల పాటు బాధ్యతలను అప్పగించింది. స్తంభాలకు విద్యుత్ దీపాలను బిగించిన సంస్థ అనంతరం నిర్వహణను గాలికి వదిలేయడంతో గ్రామాలు అంధకారంలో మునిగాయి. దీనిపై విమర్శలు రావడంతో జీపీల ద్వారా బల్బులు ఏర్పాటు చేశారు. సర్పంచులు లేకపోవడంతో కార్యదర్శులపై భారం పడుతోంది.

News August 25, 2025

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు దారుణహత్య

image

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మాక్లూర్ మండలం ధర్మోరలో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. గౌతమ్‌నగర్‌కు చెందిన జిలకర ప్రసాద్, తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి ధర్మోరకి వెళ్లాడు. అక్కడ వారి కళ్లల్లో కారం కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.