News August 25, 2025

కాప్రా: స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం

image

మేడ్చల్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలోని పద్మశాలి టౌన్‌షిప్‌లోని స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపులో స్క్రాప్ తగలబడడంతో స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News August 25, 2025

పట్టుదలతోనే పురోగతి: గోయెంకా

image

లక్ష్యసాధనలో ఉన్నవారిని ప్రోత్సహించేలా వ్యాపారవేత్త హర్ష గోయెంకా చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ఓ పని మొదలు పెట్టినప్పుడు అది వెంటనే సక్సెస్ అవ్వకపోవచ్చు. మళ్లీ ప్రయత్నించండి. ఒకటి రెండు సార్లు ప్రయత్నించినా రాకపోతే మీ పద్ధతిని మార్చుకోండి. ఇదొక నిరంతర ప్రక్రియ. సమస్య ఉంటే సాయం కోరండి. ఎవరూ చేయకపోతే మీ అనుభవంతో నేర్చుకోండి. పట్టుదలతోనే పురోగతి సాధ్యం. వదిలేయడమే ఓటమికి ఏకైక మార్గం’ అని రాసుకొచ్చారు.

News August 25, 2025

జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

image

జిల్లాలో యూరియా కొరత లేదని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. జిల్లాలో 2600 మెట్రిక్ టన్నుల యూరియా, 5600 లీటర్ల నానోయూరియా నిల్వ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని అన్ని PACS, ప్రైవేట్ డీలర్లకు యూరియాను సరఫరా చేసినట్లు తెలిపారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానోయూరియాను వాడుకోవచ్చని సూచించారు. ఎకరానికి కొంత మోతాదులో యూరియాను వాడితే సరిపోతుందన్నారు.

News August 25, 2025

జగిత్యాలలో వైభవంగా గణేశ్ ఆగమనాలు..!

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గణేశ్ ఆగమనాలు భారీగా సాగుతున్నాయి. పండక్కి 2 రోజుల సమయమే ఉండటంతో నిర్వాహకులు ట్రాఫిక్ రద్దీ, ఇతరత్రా కారణాలతో ప్రతిమలను ముందే మండపాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా భారీ సైజ్ గణనాథులు వారంరోజుల ముందుగానే మండపాలకు చేరుకున్నాయి. ఇంకొన్ని చేరుకుంటున్నాయి. కాగా, ఈసారి చవితి ఉత్సవాల కోసం పోలీసు శాఖ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఉత్సవాలు శాంతియుతంగా సాగేలా ప్రజలు కూడా సహకరించాలి.