News August 25, 2025
రేపు కాల్ లెటర్స్ విడుదల: డీఎస్సీ కన్వీనర్

AP: మెగా <<17508409>>డీఎస్సీ<<>> మెరిట్ అభ్యర్థులకు రేపు కాల్ లెటర్స్ అందుతాయని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విద్యాశాఖ అధికారులతో పాటు రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగితో కలిపి ముగ్గురు ఒక టీమ్‌గా ఉంటారని పేర్కొన్నారు. కాగా ధ్రువపత్రాల పరిశీలన ఎల్లుండి నుంచి మొదలు కానుంది.
Similar News
News August 25, 2025
పట్టుదలతోనే పురోగతి: గోయెంకా

లక్ష్యసాధనలో ఉన్నవారిని ప్రోత్సహించేలా వ్యాపారవేత్త హర్ష గోయెంకా చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ఓ పని మొదలు పెట్టినప్పుడు అది వెంటనే సక్సెస్ అవ్వకపోవచ్చు. మళ్లీ ప్రయత్నించండి. ఒకటి రెండు సార్లు ప్రయత్నించినా రాకపోతే మీ పద్ధతిని మార్చుకోండి. ఇదొక నిరంతర ప్రక్రియ. సమస్య ఉంటే సాయం కోరండి. ఎవరూ చేయకపోతే మీ అనుభవంతో నేర్చుకోండి. పట్టుదలతోనే పురోగతి సాధ్యం. వదిలేయడమే ఓటమికి ఏకైక మార్గం’ అని రాసుకొచ్చారు.
News August 25, 2025
వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్!

పండగ డిమాండ్ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి GST కొత్త శ్లాబ్స్ అమలు కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 3,4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. GSTని సరళీకరిస్తూ అన్ని వస్తువులపై ట్యాక్స్‌ను రెండు శ్లాబ్స్(5%, 18%)కు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. మీటింగ్‌లో చర్చించి వీటిపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. అయితే లగ్జరీ వస్తువులకు మాత్రం 40% GST ఉండనుంది.
News August 25, 2025
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారు: అమిత్ షా

CM, PM, మంత్రులను తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు జైలుకెళితే అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. జైలునే సీఎం, పీఎం నివాసంగా మార్చుకుని ఆర్డర్స్ పాస్ చేస్తారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుంది. కాంగ్రెస్, ఇతర పార్టీల్లోనూ చాలామంది నైతిక విలువలు కలిగిన నాయకులున్నారు’ అని స్పష్టం చేశారు.