News August 25, 2025
కిషన్‌రెడ్డి వాస్తవాలను దాస్తున్నారు: తుమ్మల

TG: యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను మంత్రి తుమ్మల ఖండించారు. ‘11 ఏళ్లుగా లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందో మీకు తెలియదా? దిగుమతులు, దేశీయంగా సరిపడా ఉత్పత్తి లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాస్తున్నారు. కేంద్రం TGకి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. కానీ 5.66 లక్షల మె.టన్నులే సరఫరా చేసింది’ అని స్పష్టం చేశారు.
Similar News
News August 25, 2025
అలాంటి కేబుల్స్ తొలగించొచ్చు: హైకోర్టు

TG: హైదరాబాద్‌లో స్తంభాలపై అనుమతి లేని కేబుల్స్ <<17483930>>తొలగించవచ్చని <<>>హైకోర్టు పేర్కొంది. కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను GHMC, విద్యుత్ శాఖ తొలగిస్తుండటంపై ఎయిర్‌టెల్ హైకోర్టును ఆశ్రయించింది. అనుమతి తీసుకున్న వాటిని కూడా తొలగిస్తున్నారని ఆ సంస్థ కోర్టుకు వివరించగా అనుమతుల వివరాలివ్వాలని TGSPDCL లాయర్ ఎయిర్‌టెల్‌ను కోరారు. తదుపరి విచారణను వాయిదా వేసింది.
News August 25, 2025
వైద్యో నారాయణో హరి.. ఈయన వారికి దేవుడే!

వైద్యం వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో బెంగళూరు సమీపంలో ఉండే బెగుర్ గ్రామంలో 50+ఏళ్లుగా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు డాక్టర్ రమణా రావు. 1973లో కొద్దిమంది రోగులతో ప్రారంభమైన ఆయన సేవలు ప్రతి ఆదివారం వేల మందికి ఆశాదీపంగా మారాయి. ఎలాంటి రుసుము తీసుకోకుండా పేదలకు వైద్యం అందిస్తున్నారు. వర్షాలు, అనారోగ్యం, కరోనా వంటివి కూడా ఆయన సేవలను ఆపలేకపోయాయి. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.
News August 25, 2025
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు!

TG: వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 48గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరిక జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే ఆస్కారముందని చెప్పింది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.