News August 25, 2025

శుభ సమయం (25-08-2025) సోమవారం

image

✒ తిథి: శుక్ల విదియ ఉ.11.38 వరకు
✒ నక్షత్రం: ఉత్తర తె.3.48 వరకు
✒ శుభ సమయం: 1)ఉ.6.36-7.12 వరకు
2)రా.7.48-8.12 వరకు
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-12.00 వరకు
✒ దుర్ముహూర్తం: 1)మ.12.24-1.12 వరకు,
2)మ.2.46-3.34 వరకు ✒ వర్జ్యం: ఉ.10.01-11.42 వరకు
✒ అమృత ఘడియలు: రా.8.14-9.54 వరకు

Similar News

News August 25, 2025

అలాంటి కేబుల్స్ తొలగించొచ్చు: హైకోర్టు

image

TG: హైదరాబాద్‌లో స్తంభాలపై అనుమతి లేని కేబుల్స్ <<17483930>>తొలగించవచ్చని <<>>హైకోర్టు పేర్కొంది. కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను GHMC, విద్యుత్ శాఖ తొలగిస్తుండటంపై ఎయిర్‌టెల్ హైకోర్టును ఆశ్రయించింది. అనుమతి తీసుకున్న వాటిని కూడా తొలగిస్తున్నారని ఆ సంస్థ కోర్టుకు వివరించగా అనుమతుల వివరాలివ్వాలని TGSPDCL లాయర్ ఎయిర్‌టెల్‌ను కోరారు. తదుపరి విచారణను వాయిదా వేసింది.

News August 25, 2025

వైద్యో నారాయణో హరి.. ఈయన వారికి దేవుడే!

image

వైద్యం వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో బెంగళూరు సమీపంలో ఉండే బెగుర్ గ్రామంలో 50+ఏళ్లుగా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు డాక్టర్ రమణా రావు. 1973లో కొద్దిమంది రోగులతో ప్రారంభమైన ఆయన సేవలు ప్రతి ఆదివారం వేల మందికి ఆశాదీపంగా మారాయి. ఎలాంటి రుసుము తీసుకోకుండా పేదలకు వైద్యం అందిస్తున్నారు. వర్షాలు, అనారోగ్యం, కరోనా వంటివి కూడా ఆయన సేవలను ఆపలేకపోయాయి. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.

News August 25, 2025

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు!

image

TG: వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 48గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరిక జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే ఆస్కారముందని చెప్పింది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.