News April 2, 2024
గుంటూరు: భార్యకు తెలియకుండా కానిస్టేబుల్ రెండో పెళ్లి

కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన భర్త మరో యువతిని పెళ్లి చేసుకొని మోసగించాడని భార్య సోమవారం పోలీసు కార్యాలయంలో, గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్‌కి ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గుంటూరులో కానిస్టేబుల్ పనిచేస్తున్న జనార్దనరావుతో పదహారేళ్ల కిందట వివాహమైందన్నారు. భర్త మరో యువతిని వివాహం చేసుకున్నాడని, నాకు విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసగించిన అతనిపై చర్యలు తీసుకొవాలని కోరారు.
Similar News
News April 19, 2025
జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

గుంటూరులో ఒక వ్యక్తి ఇంటి కల విషాదంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. ఫారూఖ్ ప్రగతినగర్‌లో తన ప్లాట్‌లో ఇంటి నిర్మాణానికి రాము అనే వ్యక్తికి రూ. 1 లక్ష ఇచ్చాడు. పనులు నెమ్మదిగా సాగడం, అడిగినా స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫారూఖ్, ఈ నెల 16న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 19, 2025
GNT: మానవత్వం చాటుకున్న లాలాపేట పోలీసులు

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట స్టేషన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంగడిగుంటలో ఏఎస్సై నరసింహారావు, కానిస్టేబుల్ నాగరాజు గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి తన భార్య కాన్పు నొప్పులతో బాధపడుతుందని, వాహన సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గస్తీ పోలీసులు గర్భిణిని తమ వాహనంలో జీజీహెచ్ కాన్పుల వార్డుకు తరలించారు.
News April 19, 2025
GNT: ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న తుళ్ళూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ, ఎక్సైజ్ కమిషనర్ నీషాంత్ కుమార్, జేసీ భార్గవ్ తేజ, ఎంటీఎంసీ కమిషనర్ అలీబాషా, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా హెలీప్యాడ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.