News August 25, 2025
తంబళ్లపల్లె: షూటింగ్ బాల్ జూనియర్ జట్టుకు ముగ్గురు ఎంపిక

తంబళ్లపల్లె (M) కన్నెమడుగు హై స్కూల్ నుంచి ముగ్గురు విద్యార్ధినులు జూనియర్ షూటింగ్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారని పీడీ ఖాదర్ బాషా తెలిపారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధినులు రిషిత, ప్రియ ప్రవల్లికతో పాటు స్టాండ్ బైగా స్వాతి ఎంపికయ్యారన్నారు. మదనపల్లెలోని ఓ పాఠశాలలో ఆదివారం జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ జునైద్ అక్బరీ, కార్యదర్శి గౌతమి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా జట్టు ఎంపిక జరిగింది.
Similar News
News August 25, 2025
NZB: విగ్రహాలు తరలించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి: CP

గణేశ్ మండలి నిర్వహకులు విగ్రహాలను తరలించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ CP సాయి చైతన్య సూచించారు. కొన్ని రోజులుగా 4 విద్యుత్ ప్రమాదాలు జరిగాయని, వాటిలో 9 మంది యువకులు మరణించారని పేర్కొన్నారు. గణేశ్ విగ్రహాల రవాణా, స్థాపించే మండపాల వద్ద ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ పోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
News August 25, 2025
నిమజ్జనాల వరకు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

వినాయక చవితి వేడుకల సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనాల వరకు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి పండుగ కార్యక్రమాలపై ఐడీవోసీలో సమీక్ష నిర్వహించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News August 25, 2025
అలాంటి కేబుల్స్ తొలగించొచ్చు: హైకోర్టు

TG: హైదరాబాద్‌లో స్తంభాలపై అనుమతి లేని కేబుల్స్ <<17483930>>తొలగించవచ్చని <<>>హైకోర్టు పేర్కొంది. కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను GHMC, విద్యుత్ శాఖ తొలగిస్తుండటంపై ఎయిర్‌టెల్ హైకోర్టును ఆశ్రయించింది. అనుమతి తీసుకున్న వాటిని కూడా తొలగిస్తున్నారని ఆ సంస్థ కోర్టుకు వివరించగా అనుమతుల వివరాలివ్వాలని TGSPDCL లాయర్ ఎయిర్‌టెల్‌ను కోరారు. తదుపరి విచారణను వాయిదా వేసింది.