News August 25, 2025

కాశినాయన: బాల్ బ్యాట్మెంటన్‌లో సత్తా చాటిన విద్యార్థులు

image

రాజంపేటలో ఆదివారం జరిగిన బాల్ బ్యాట్మెంటన్ పోటీలలో కాశినాయన మండలం నరసాపురం ZPHS విద్యార్థులు సత్తా చాటారు. ఉమ్మడి కడప జిల్లా బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. సబ్ జూనియర్స్ విభాగంలో ఇర్ఫాన్, సంపత్, సీనియర్ విభాగంలో సోహెల్ ఈ నెల 29, 30, 31వ తేదీలలో ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో వారిని పలువురు అభినందించారు.

Similar News

News August 25, 2025

మహిళలకు రక్షణ లేదు: రాచమల్లు

image

కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారిపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువయ్యాయన్నారు. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని విమర్శించారు.

News August 25, 2025

కడప: గంజాయి అమ్మకాలపై తనిఖీలు

image

కడపలో గంజాయి నిర్మూలనకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంజాయి అమ్మకాలకు సంబంధించి దుకాణాలను పరిశీలించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉంటున్న వ్యక్తులను విచారించారు. గంజాయి అమ్మకాలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News August 24, 2025

కడప: రేపటి నుంచి కౌన్సెలింగ్

image

కడప జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సోమవారం నుంచి కౌన్సెలింగ్ జరుగుతుందని వీసీ డాక్టర్ విశ్వనాథ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. బీఎఫ్‌ఏ(ఫోర్ ఇయర్స్ డిగ్రీ) ఫైన్ ఆర్ట్స్ (యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పం, బి. డెస్ ఇంటీరియర్ డిజైన్‌) కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.