News August 25, 2025

ఆగస్టు 25: చరిత్రలో ఈ రోజు

image

1952: తమిళ నటుడు విజయ్ కాంత్ జననం
1953: పత్రికా సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి మరణం
1994: రెజ్లర్ వినేశ్ ఫొగట్ జననం
1999: తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్యదేవర సంజీవదేవ్ మరణం
2007: గోకుల్ చాట్, లుంబినీ పార్కులో ముష్కరుల బాంబు దాడి.. 42 మంది మృతి
2012: చంద్రుడిపై కాలు పెట్టిన తొలి మనిషి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరణం(ఫొటోలో)

Similar News

News August 25, 2025

CVIRMS పోర్టల్‌లో తిరుపతికి వచ్చే భక్తుల వివరాలు: SP

image

AP: తిరుపతిలో CVIRMS(సిటీ విజిటర్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పోర్టల్ ప్రారంభించినట్లు SP హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. తిరుపతి, తిరుచానూరు, అలిపిరిలోని హోటళ్లు, హోమ్ స్టే, లాడ్జిల్లో బస చేసే భక్తుల వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. తిరుపతిలో పూర్తిస్థాయిలో అమలు చేసిన అనంతరం శ్రీకాళహస్తికి విస్తరించనున్నారు. దీని ద్వారా భక్తుల భద్రత మెరుగుపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

News August 25, 2025

స్కూళ్లలో ఉచిత ప్రవేశాల లాటరీ ఫలితాలు విడుదల

image

AP: RTE కింద పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 1వ తరగతి ఉచిత ప్రవేశాల అదనపు నోటిఫికేషన్ లాటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. 11,702మంది ఎంపిక కాగా, ఆగస్టు 31లోపు విద్యార్థులు స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ తెలిపింది. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు అందుతుందని చెప్పింది. ఈ <>వెబ్‌సైట్‌<<>>లోనూ చెక్ చేసుకోవచ్చని వివరించింది.

News August 25, 2025

ఉత్తమ టీచర్ అవార్డులు ప్రకటించిన కేంద్రం

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు 45 మంది <>టీచర్లను <<>>కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వారికి అవార్డులు ప్రదానం చేయనుంది. APలోని విశాఖ నెహ్రూ మున్సిపల్ హైస్కూలుకు చెందిన తిరుమల శ్రీదేవి, TGలోని సూర్యాపేట పెన్‌పహాడ్ ZPHSకు చెందిన మరమ్ పవిత్ర ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఎంపికైన టీచర్లను రూ.50,000 నగదు, వెండి పతకంతో సత్కరిస్తారు.