News August 25, 2025

రాష్ట్రస్థాయి విజేతగా ఉమ్మడి వరంగల్ జట్టు

image

యువత క్రీడల్లో రాణించాలని బాల్ బ్యాడ్మింటన్ కొమురం భీం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌లో పురుషులు, మహిళల బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీలు ఆదివారం ముగిశాయి. పురుషుల విభాగంలో ఉమ్మడి వరంగల్ విజేతగా, రంగారెడ్డి రన్నరప్‌గా నిలిచాయి. మహిళల విభాగంలో ఆదిలాబాద్ విజేతగా, వరంగల్ రన్నరప్‌గా నిలిచి బహుమతులు అందుకున్నాయి.

Similar News

News August 25, 2025

ASF: గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి: ఎస్పీ

image

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ శాంతి లాల్ పాటిల్ సూచించారు. సోమవారం ఆసిఫాబాద్ ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గణేశ్ మండపాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News August 25, 2025

CVIRMS పోర్టల్‌లో తిరుపతికి వచ్చే భక్తుల వివరాలు: SP

image

AP: తిరుపతిలో CVIRMS(సిటీ విజిటర్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పోర్టల్ ప్రారంభించినట్లు SP హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. తిరుపతి, తిరుచానూరు, అలిపిరిలోని హోటళ్లు, హోమ్ స్టే, లాడ్జిల్లో బస చేసే భక్తుల వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. తిరుపతిలో పూర్తిస్థాయిలో అమలు చేసిన అనంతరం శ్రీకాళహస్తికి విస్తరించనున్నారు. దీని ద్వారా భక్తుల భద్రత మెరుగుపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

News August 25, 2025

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

image

ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ములుగు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పండుగలను భక్తి భావంతో నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఈ సంవత్సరం ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నిమజ్జనానికి వెళ్లే రూట్లలో విద్యుత్ తీగల విషయంలో ఆ శాఖ సిబ్బంది అలర్ట్ ఉండాలన్నారు.