News August 25, 2025

విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు: ADB DSP

image

మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. గ్రామీణ మండలం అంకోలిలో ఆయన ఇరువర్గాల ప్రజలతో మాట్లాడారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా పోలీసులను సంప్రదించాలని కోరారు. వాట్సాప్ గ్రూపుల్లో గొడవలకు దారి తీసే పోస్టులు పెట్టవద్దని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News August 25, 2025

95 గంజాయి మొక్కలు స్వాధీనం: ADB ఎస్పీ

image

గంజాయి రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దడం పోలీసులు ప్రధాన లక్ష్యం అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నార్నూర్ మండలం సుంగాపూర్‌లో గంజాయి పండిస్తున్నారని సమాచారం మేరకు సీసీఎస్, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ భూమిలో 95 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంజాయి పండించిన కొడప దేవురావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

News August 24, 2025

ఆదిలాబాద్: ‘ఉద్యోగులకు శాపంగా సీపీఎస్’

image

ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల శాపంగా మారిన సీపీఎస్ రద్దు పరిచి ఓపీఎస్ అమలు చేయించడమే పీఆర్టీయూ తెలంగాణ ప్రధాన లక్ష్యమని తెలంగాణ జిల్లా అధ్యక్షకార్యదర్శులు నూర్ సింగ్, నవీన్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ వద్ద జరిగిన విరమణ దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాటు ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందన్నారు.

News August 24, 2025

తాంసిలో వైభవంగా ఎద్దుల జాతర.. హాజరైన కలెక్టర్, ఎస్పీ

image

తాంసి మండల కేంద్రంలో పొలాల అమావాస్యను పురస్కరించుకొని శనివారం ఎద్దుల జాతర వైభవంగా జరిగింది. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్థులు కలిసి బసవన్నకు ప్రత్యేక పూజలు చేసి, గ్రామంలో ఊరేగించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.