News August 25, 2025

ఈ సమయాల్లో నీరు తాగితే?

image

శరీరానికి అత్యవసరమైన వాటిలో నీరు ఒకటి. రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగితే ఎన్నో రోగాలను ముందుగానే నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
✒ నిద్ర లేవగానే గోరు వెచ్చని నీరు తాగితే టాక్సిన్స్‌(వ్యర్థాలు)ను బయటకు పంపుతుంది. ✒ భోజనానికి ముందు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ✒ స్నానానికి ముందు నీరు తాగితే బీపీ నియంత్రణలో ఉంటుంది. ✒ నిద్రకు ముందు తాగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ నుంచి రక్షణ కలుగుతుంది.

Similar News

News August 25, 2025

వీళ్లు భర్తలు కాదు.. నరరూప రాక్షసులు

image

TGలో పలువురు భర్తల వరుస దురాగతాలు ఉలిక్కిపడేలా చేశాయి. HYDలో అనుమానంతో 4 నెలల గర్భవతైన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి చంపి, ముక్కలు చేసి మూసీలో పడేశాడు. అదే అనుమానంతో నాగర్‌కర్నూల్(D) పెద్దకొత్తపల్లిలో భార్య శ్రావణిని భర్త శ్రీశైలం హత్య చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కొత్తగూడెంలో లక్ష్మీప్రసన్నను రెండేళ్లుగా కడుపు మాడ్చి చంపేయగా, వరంగల్‌లో భార్య గౌతమిని భర్త ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

News August 25, 2025

లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్స్

image

గ్లోబల్ మార్కెట్లో పాజిటివ్ సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 223 పాయింట్ల లాభంతో 81,530, నిఫ్టీ 56 పాయింట్ల వృద్ధితో 24,926 వద్ద ట్రేడింగ్ స్టార్ట్ అయింది. టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, ట్రెంట్ లాభాల్లో ట్రేడవుతుండగా, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సెర్వ్, మారుతీ సుజుకీ, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News August 25, 2025

బాలకృష్ణ రికార్డు.. అభినందించిన పవన్

image

AP: సినీ నటుడు, MLA బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ‘స్వర్గీయ NTR నట వారసుడిగా 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. వైవిధ్యమైన చిత్రాలతో మెప్పిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన పద్మ భూషణ్ బాలకృష్ణకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.