News August 25, 2025
నేడు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. వర్సిటీలో కొత్తగా నిర్మించిన హాస్టళ్ల ప్రారంభోత్సవంతో పాటు పలు భవనాల నిర్మాణాలకు సంబంధించి భూమి పూజలో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం ఓయూకు వెళ్లడం ఇదే తొలిసారి. అటు వర్సిటీ భూముల సర్వే, నియామకాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఓయూ కార్యక్రమం అనంతరం ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది.
Similar News
News August 25, 2025
వైద్యో నారాయణో హరి.. ఈయన వారికి దేవుడే!

వైద్యం వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో బెంగళూరు సమీపంలో ఉండే బెగుర్ గ్రామంలో 50+ఏళ్లుగా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు డాక్టర్ రమణా రావు. 1973లో కొద్దిమంది రోగులతో ప్రారంభమైన ఆయన సేవలు ప్రతి ఆదివారం వేల మందికి ఆశాదీపంగా మారాయి. ఎలాంటి రుసుము తీసుకోకుండా పేదలకు వైద్యం అందిస్తున్నారు. వర్షాలు, అనారోగ్యం, కరోనా వంటివి కూడా ఆయన సేవలను ఆపలేకపోయాయి. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.
News August 25, 2025
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు!

TG: వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 48గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరిక జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే ఆస్కారముందని చెప్పింది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.
News August 25, 2025
నవరాత్రి ఉత్సవాలకు ఫ్రీ కరెంట్: మంత్రి లోకేశ్

AP: వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో ఫ్రీ కరెంట్ ఇవ్వాలంటూ వచ్చిన వినతులపై CM, మంత్రి గొట్టిపాటితో చర్చించినట్లు తెలిపారు. ‘దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ మండపాలకూ ఉచిత విద్యుత్ అందిస్తాం. వినాయక చవితి, దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం రూ.25 కోట్లు ప్రభుత్వం భరిస్తుంది’ అని పేర్కొన్నారు.