News August 25, 2025
సింధు సత్తా చాటేనా!

నేటి నుంచి BWF వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మొదలు కానుంది. మెన్స్ సింగిల్స్‌లో భారత ప్లేయర్ లక్ష్యసేన్ టాప్ సీడ్ షియుక్వి(చైనా)తో తలపడనున్నారు. మహిళల విభాగంలో PV సింధు బల్గేరియాకు చెందిన కలోయానతో పోటీ పడనున్నారు. ఈ టోర్నీలోనైనా సింధు ఫామ్ అందుకుంటారో చూడాలి. ఇక మెన్స్ డబుల్స్‌లో IND నుంచి సాయిరాజ్-చిరాగ్ జోడీ, ఉమెన్స్ డబుల్స్‌లో ప్రియా-శ్రుతి మిశ్రా, రుతుపర్ణ-శ్వేతపర్ణ బరిలో ఉన్నారు.
Similar News
News August 25, 2025
ఎల్లుండి నుంచి OTTలో ‘కింగ్డమ్’ స్ట్రీమింగ్

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘కింగ్డమ్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వినాయకచవితి కానుకగా ఈనెల 27నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
News August 25, 2025
పాక్‌కు అలర్ట్.. మానవత్వం చాటుకున్న భారత్

సింధు జలాల ఒప్పందం నిలిచిపోయినా వరదలపై పాకిస్థాన్‌ను హెచ్చరించి ఇండియా మానవత్వం చాటుకుందని PTI కొన్ని కథనాలను ఉటంకించింది. భారీ వర్షాలకు జమ్మూకశ్మీర్‌లోని తావి నది ఉప్పొంగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనిపై పాక్‌ను ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ద్వారా అలర్ట్ చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. మన అలర్ట్‌తో పాక్ యంత్రాంగం తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.
News August 25, 2025
అధికార భాషా సంఘానికి కృష్ణారావు పేరు

AP: అధికార భాషా సంఘానికి అవనిగడ్డకు చెందిన మండలి వెంకట కృష్ణారావు పేరు పెడుతూ ప్రభుత్వం GO ఇచ్చింది. దివిసీమ గాంధీగా పేరొందిన ఆయన తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 1975లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను HYDలో మంత్రి హోదాలో నిర్వహించారు. తెలుగు సంఘాలను ఏకతాటిపైకి తెచ్చారు. పేదలకు 15,000 ఎకరాల భూమి పంచారు. బందర్ MPగా, అవనిగడ్డ నుంచి 3 సార్లు MLAగా గెలిచారు. ప్రస్తుత MLA బుద్ధప్రసాద్ ఆయన కుమారుడే.