News August 25, 2025
డీఎస్సీ అభ్యర్థుల వెరిఫికేషన్ వాయిదా: డీఈవో

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల వెరిఫికేషన్‌ను సోమవారం సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాలతో రద్దు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వెరిఫికేషన్‌కు సంబంధించిన తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని ఆమె తెలిపారు.
Similar News
News August 25, 2025
శాంతియుతంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి: ఎస్పీ

నిర్మల్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, మత సామరస్య వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.
News August 25, 2025
ఎల్లుండి నుంచి OTTలో ‘కింగ్డమ్’ స్ట్రీమింగ్

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘కింగ్డమ్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వినాయకచవితి కానుకగా ఈనెల 27నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
News August 25, 2025
కామారెడ్డి కలెక్టరేట్‌లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. రసాయనాలతో తయారైన విగ్రహాల వల్ల నీరు, నేల కలుషితం అవుతాయన్నారు. స్వచ్ఛమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలన్నారు.