News August 25, 2025
వరుస పండుగలు.. 22 స్పెషల్ ట్రైన్స్

దసరా, దీపావళి, ఛట్ పండగలకు 22 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. SEP 4-25 వరకు సికింద్రాబాద్, తిరుపతి మధ్య 4, కాచిగూడ-నాగర్ సోల్ మధ్య 4 సర్వీసులు, 5-26 వరకు తిరుపతి-సికింద్రాబాద్ 4, నాగర్ సోల్-కాచిగూడ 4 సర్వీసులు నడుస్తాయన్నారు. SEP 19-OCT 3 వరకు సంత్రాగ్జి-చర్లపల్లి మధ్య 3, SEP 20-OCT 4 వరకు చర్లపల్లి-సంత్రాగ్జి మధ్య 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.
Similar News
News August 25, 2025
ఉత్తమ టీచర్ అవార్డులు ప్రకటించిన కేంద్రం

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు 45 మంది <
News August 25, 2025
మోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలన్న ఆదేశాలు కొట్టివేత

PM మోదీ డిగ్రీ సమాచారాన్ని బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్(CIC) ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. తాను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1978లో BA పాసైనట్లు గతంలో మోదీ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనగా, ఆ వివరాల కోసం ఓ వ్యక్తి RTI దాఖలు చేశారు. ఈ వివరాలు ఇవ్వాలని CIC ఆదేశాలు జారీ చేయగా, వాటిని ఢిల్లీ వర్సిటీ కోర్టులో సవాల్ చేసింది.
News August 25, 2025
CM రేవంత్‌కు రక్షణగా బీజేపీ ఎంపీలు: KTR

TG: BJP MPలు CM రేవంత్‌కు రక్షణగా ఉంటున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘6 గ్యారంటీలపై BJP MPలు ఎప్పుడైనా రేవంత్‌ను ప్రశ్నించడం చూశారా? KCRపై మాత్రం మాట్లాడతారు. బడే భాయ్ (మోదీ), చోటా భాయ్ (రేవంత్) కలిసి పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆటలో అరటిపండు లాంటివాడు. ఆయనకు ఎప్పుడో దెబ్బ పడుతుంది’ అని వ్యాఖ్యానించారు. గత 11 ఏళ్లలో TGకి BJP ఎలాంటి సాయం చేయలేదని, గాయాలు చేసిందని విమర్శించారు.