News August 25, 2025
విశాఖ: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. విశాఖ జిల్లాలో 5,17,149 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వలస వెళ్లిన లబ్ధిదరులు తమ కార్డును నమోదు చేసుకున్న రేషన్ దుకాణం వద్దే తీసుకోవాలన్నారు. ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది.
Similar News
News August 25, 2025
విశాఖ జిల్లాలో 5,616 స్మార్ట్ కార్డులు పంపిణీ: జేసీ

జిల్లాలో సోమవారం 5,616 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని జేసీ మయూర్ అశోక్ తెలిపారు. ఈనెల 31 వరకు సచివాలయాల సిబ్బంది ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు సంబంధిత రేషన్ దుకాణాల వద్ద పంపిణీ చేస్తామన్నారు. పాత బియ్యం కార్డు, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబరుతో సచివాలయ సిబ్బంది నుంచి స్మార్ట్ కార్డులు తీసుకోవాలన్నారు.
News August 25, 2025
విశాఖ కలెక్టర్ పీజీఆర్ఎస్‌కు 329 వినతులు

విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 329 వినతులు అందాయి. కలెక్టర్ హరేందర్ ప్రసాద్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 141, జీవీఎంసీకి చెందినవి 72, పోలీస్ శాఖకు సంబంధించినవి 17 ఉండగా ఇతర శాఖలకు చెందినవి 99 ఫిర్యాదులు వచ్చాయి.
News August 25, 2025
విశాఖలో సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు

ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 40వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు జరుగుతాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో పోస్టర్‌ను ఆవిష్కరించారు. నేత్రదానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డీఎం & హెచ్వో జగదీశ్వరరావు, ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ ఉన్నారు.