News August 25, 2025
నేటి నుంచే కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

కడప జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేటి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్యుమెంట్ల పరిశీలన చేయనున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. సోమవారం హాల్ టికెట్ నెం.4001160 నుంచి 4206930 అభ్యర్థుల డాక్యుమెంట్ల పరిశీలిస్తారు. మంగళవారం హాల్ టికెట్ నెం.4214369 నుంచి 4504062 అభ్యర్థుల వివరాలు క్రాస్ చెక్ చేస్తారు.
Similar News
News August 25, 2025
జమ్మికుంట: మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణ

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో సోమవారం పర్యావరణ హితమైన వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మట్టి వినాయకులను తయారు చేసి పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలియజేసే విధంగా జరిగింది.
News August 25, 2025
వికలాంగుల పెన్షన్లు రద్దు చేయలేదు: మంత్రి పయ్యావుల

AP: వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఖండించారు. ‘కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చాం. 40% పైబడి అంగవైకల్యం ఉన్న వారికే పెన్షన్లు ఇస్తాం. నోటీసులు అందుకున్న వారు మెడికల్ బోర్డు దగ్గర తమ వైకల్యం నిరూపించుకోవాలి. మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్లు అందిస్తాం’ అని స్పష్టం చేశారు. అటు SEP 6న అనంతపురంలో CM CBN పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.
News August 25, 2025
KNR: నేటి నుంచి మిలాద్ ఉన్నబీ వేడుకలు

ప్రవక్త మహ్మద్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో మిలాద్ ఉన్నబీ వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాలు నేటి నుంచి SEP 25 వరకు జరుగుతాయని జమాతే ఇస్లామీ హింద్ నేత మహమ్మద్ నాయిముద్దీన్ సోమవారం కరీంనగర్‌లో ప్రకటించారు. ప్రవక్త బోధనలు ఒక మతానికి మాత్రమే పరిమితం కాకుండా అందరికీ వర్తిస్తాయని, సమాజంలో మార్పు కోసం దోహద పడతాయని చెప్పారు. ప్రవక్త గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పోటీలు నిర్వహిస్తామన్నారు.