News August 25, 2025

పాఠశాల భవనంపై నుంచి పడిన విద్యార్థిని

image

రంపచోడవరం KGBV భవనంపై నుంచి పడి 10వ తరగతి విద్యార్థిని మానస గాయపడింది. తోటి విద్యార్థినులతో పాటు ఆదివారం ఆమె పాఠశాల భవనంపైకి వెళ్లింది కళ్లుతిరగడంతో భవనంపై నుంచి క్రింద పడిందని విద్యార్థినులు తెలిపారు. క్రింద ఉన్న ఇసుక గుట్టపై పడడంతో స్వల్పగాయలతో బయటపడింది. వెంటనే పాఠశాల సిబ్బంది స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారన్నారు.

Similar News

News August 25, 2025

మదనపల్లె: రక్త దానానికి యువత ముందుకు రావాలి: ఐశ్వర్య రాజేశ్

image

అపోహలు వీడి రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని సినీ నటి, హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ పిలుపునిచ్చారు. సోమవారం మదనపల్లెలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను హెల్పింగ్ మైండ్స్ వారు కలిశారు. ఈ సందర్బంగా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆమె తెలుసుకుని అభినందించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలని ఆమె కోరారు.

News August 25, 2025

BSFలో 1,121 ఉద్యోగాలు.. వివరాలివే

image

BSF 1,121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. టెన్త్+రెండేళ్ల ITI లేదా ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 60% మార్కులున్న వారు అర్హులు. వయసు జనరల్ అభ్యర్థులకు 18-25, OBC 18-28, SC, STలకు 18-30 ఏళ్లు ఉండాలి. ఫిజికల్, CBT టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం: ₹25,500-81,100, <>దరఖాస్తుకు<<>> లాస్ట్ డేట్: సెప్టెంబర్ 23. SHARE IT.

News August 25, 2025

NRPT: భూముల సమస్యలు కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలి

image

భూములకు సంబంధించిన సమస్యలు కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. మొత్తం 19 అర్జీలు అందించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.