News August 25, 2025

సంగారెడ్డి: రేపు ఉద్యోగ మేళా

image

సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం సోమవారం తెలిపారు. హెచ్సీఎల్ టెక్‌బీ ఆధ్వర్యంలో మేళా జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపికైన వారికి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News August 25, 2025

నిర్మల్ నుండి మహారాష్ట్రకు బస్సు సర్వీసులు ప్రారంభం

image

నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి మహారాష్ట్రలోని అప్పారావుపేట, మలక్‌జాం గ్రామాలకు కొత్త బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సులు రోజుకు మూడుసార్లు అందుబాటులో ఉంటాయని నిర్మల్ డిపో మేనేజర్ పండరి తెలిపారు. ఉదయం 9:50, మధ్యాహ్నం 2:00, సాయంత్రం 5:10 గంటలకు ఈ బస్సులు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త సర్వీసులను వినియోగించుకుని ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

News August 25, 2025

కేంద్రంతో కోట్లాడి యూరియాను తీసుకొచ్చాం: మంత్రి తుమ్మల

image

యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై కోట్లాడి35 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చామన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలకు తరలించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా యూరియా కొరత ఏర్పడిందన్నారు.

News August 25, 2025

జిల్లాలో గణేష్ ఉత్సవాలపై సూచనలు: ఎస్పీ

image

నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల కమిటీ నిర్వాహకులు పర్మిషన్ ఆన్‌లైన్ ధ్వారా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. రహదారులు మూసివేసి గణేష్ మండపాలు వేయకూడదని హెచ్చరించారు. గణేష్ మండపాలకు విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.