News April 2, 2024
ఉమ్మడి KNR జిల్లా వాసికి మిస్ టీన్ గెలాక్సీ టైటిల్

బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్ యూకే టైటిల్ కైవసం చేసుకుంది. యూకేలోని వారింగ్‌టన్ పార్ హాల్‌లో యునైటెడ్ కింగ్‌డమ్ నలుమూలల నుంచి 25 మంది యువతులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది. వచ్చే ఆగస్టులో యూఎస్‌ఏలో జరిగే పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
Similar News
News April 22, 2025
కరీంనగర్: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 68.23 శాతం

ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 17,794 మందికి 12,141 మంది పాసయ్యారు. 68.23 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్‌లో 15,187 మంది పరీక్షలు రాయగా 11,092 మంది పాసయ్యారు. 73.04 శాతం పర్సంటేజీ వచ్చింది.
News April 22, 2025
కొత్తపల్లి చెరువులో దొరికిన మృతదేహం వివరాలు లభ్యం

కరీంనగర్ కొత్తపల్లి హవేలీ చెరువులో యువకుడి మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి భార్గవ్‌గా పోలీసులు గుర్తించారు. భార్గవ్ తల్లిదండ్రులు కొత్తపల్లికి చెందిన పబ్బోజు నాగరాజు యాదలక్ష్మి కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ క్రమంలో కొత్తపెళ్లి చెరువు వద్ద మృతదేహం లభించడంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
News April 22, 2025
కరీంనగర్ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత ఎండ..

కరీంనగర్ జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 43.5°C నమోదు కాగా, జమ్మికుంట 43.4, గంగాధర 43.2, తిమ్మాపూర్ 43.0, కరీంనగర్ 42.8, గన్నేరువరం 42.7, వీణవంక, కరీంనగర్ రూరల్ 42.6, రామడుగు, చిగురుమామిడి 42.5, హుజూరాబాద్, కొత్తపల్లి 42.4, ఇల్లందకుంట 42.3, శంకరపట్నం 42.2, చొప్పదండి 41.5, సైదాపూర్ 40.1°C గా నమోదైంది.