News August 25, 2025
OT డ్యూటీలతో ఆరోగ్యంపై ప్రభావం: సర్వే

ఉద్యోగుల్లో ఓవర్ టైమ్(OT) వర్క్ చేయడంపై వ్యతిరేకత ఉందని జీనియస్ HR టెక్ సర్వేలో తేలింది. అదనపు ప్రయోజనాలు లేకుండా వర్కింగ్ అవర్స్‌ను పొడిగించడాన్ని మెజార్టీ ఉద్యోగులు వ్యతిరేకించినట్లు పేర్కొంది. ఓవర్ టైమ్ డ్యూటీలతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని 44% మంది ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. తగిన బెనిఫిట్స్ ఉంటే OT చేసేందుకు ఇబ్బందేమీ లేదని 40శాతం చెప్పినట్లు వెల్లడించింది.
Similar News
News August 25, 2025
BSFలో 1,121 ఉద్యోగాలు.. వివరాలివే

BSF 1,121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. టెన్త్+రెండేళ్ల ITI లేదా ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 60% మార్కులున్న వారు అర్హులు. వయసు జనరల్ అభ్యర్థులకు 18-25, OBC 18-28, SC, STలకు 18-30 ఏళ్లు ఉండాలి. ఫిజికల్, CBT టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం: ₹25,500-81,100, <
News August 25, 2025
జగన్‌పై విష ప్రచారం చేస్తున్నారు: భూమన

AP: YCP అధినేత జగన్‌పై TTD ఛైర్మన్ BR నాయుడు ఛానల్ విష ప్రచారం చేస్తోందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈనెల 27న జగన్ తిరుమల పర్యటన అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారన్నారు. ‘చంద్రబాబు పాలనలో కంటే YCP హయాంలోనే కొన్ని వేల రెట్లు హిందూ ధర్మ పరిరక్షణ జరిగింది. CMగా జగన్ ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీనివాస దివ్య హోమం ఆయన పాలనలోనే ప్రారంభమైంది’ అని వివరించారు.
News August 25, 2025
CVIRMS పోర్టల్‌లో తిరుపతికి వచ్చే భక్తుల వివరాలు: SP

AP: తిరుపతిలో CVIRMS(సిటీ విజిటర్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పోర్టల్ ప్రారంభించినట్లు SP హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. తిరుపతి, తిరుచానూరు, అలిపిరిలోని హోటళ్లు, హోమ్ స్టే, లాడ్జిల్లో బస చేసే భక్తుల వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. తిరుపతిలో పూర్తిస్థాయిలో అమలు చేసిన అనంతరం శ్రీకాళహస్తికి విస్తరించనున్నారు. దీని ద్వారా భక్తుల భద్రత మెరుగుపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.