News August 25, 2025
స్నేహమే సక్సెస్ కీ.. నలుగురికీ టీచర్ ఉద్యోగాలు

నలుగురూ ఫ్రెండ్స్. కర్నూలు బి క్యాంప్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని డీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. ఫలితాల్లో అందరూ ఉద్యోగాలు సాధించడంతో వారి ఆనంధానికి అవధుల్లేవు. గూడూరు గ్రామానికి చెందిన జి.వెంకటేశ్(85.9), అమడగుంట్ల గ్రామానికి చెందిన జి.ఉపేంద్ర(83.7), బెల్లల్ గ్రామానికి చెందిన ఎం.విజయ్ కుమార్(80.3), వై.సురేంద్ర(77.1) ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. ఈ విజయంపై తల్లిదండ్రులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News August 25, 2025
చొప్పదండి: వృద్ధురాలిని రక్షించిన ఫైర్ సిబ్బంది

చొప్పదండి పట్టణంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డ ఓ వృద్ధురాలిని ఫైర్ అధికారులు కాపాడిన ఘటన సోమవారం జరిగింది. స్థానిక 13వ వార్డుకు చెందిన పంచల భాగ్యలక్ష్మి అనే వృద్ధురాలు అనుకోకుండా బావిలో పడింది. విషయం తెలిసిన వెంటనే చొప్పదండి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ పవన్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది రెస్కు ఆపరేషన్లో భాగంగా తాళ్ల సాయంతో వృద్ధురాలిని
క్షేమంగా బయటికు తీశారు. ఈ సందర్భంగా పలువురు ఫైర్ సిబ్బందిని అభినందించారు.
News August 25, 2025
ఆశాలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి: హరీశ్ రావు

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. సోమవారం డిమాండ్ల సాధనకై ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆశా వర్కర్ల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు. ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష పాల్గొన్నారు.
News August 25, 2025
వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ) రూ.2,365, సూక పల్లికాయ రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.3,500 పలికాయి. అలాగే 5531 రకం మిర్చికి రూ.13 వేలు, ఇండిక మిర్చి రూ.13,800, డీడీ మిర్చి రూ.14 వేలు, నం.5 రకం మిర్చికి రూ.13,300 ధర లభించిందని వ్యాపారులు తెలిపారు.