News August 25, 2025

BRSలోకి కోనప్ప..! RSP పరిస్థితి ఏంటి..?

image

ASF జిల్లాలో రాజకీయం రోజుకో ములుపు తిరుగుతోంది. మాజీ MLA కోనేరు కోనప్ప BRSలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన ప్రత్యర్థి RSP పార్టీలో చేరడంతో కాంగ్రెస్ గూటికి చేరారు కోనప్ప. కానీ ఆ పార్టీలో కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తనకీ కాంగ్రెస్‌కు సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. కోనప్ప మళ్లీ BRSలోకి వస్తే RSPతో కలిసి పని చేస్తారా? ఇద్దరి మధ్య వైరం అలాగే ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.

Similar News

News August 26, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 110 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 110 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

News August 25, 2025

6,589 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

SBIలో 6,589 జూనియర్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అభ్యర్థుల వయసు 20-28 ఏళ్లు ఉండాలి. డిగ్రీ చేసిన వారు అర్హులు. ఫైనలియర్ చదువుతున్న వారూ అప్లై చేయవచ్చు. కానీ DEC 31, 2025కి ముందు డిగ్రీ పాసై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, OBC, EWS కేటగిరీ విద్యార్థులకు ₹750. మిగతా వారికి లేదు.
వెబ్‌సైట్: <>sbi.co.in<<>>

News August 25, 2025

మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో కలెక్టర్

image

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర ధార్మిక పరిషత్ ఛైర్మన్ వంగపల్లి అంజయ్య స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాల వల్ల జరిగే కాలుష్యం గురించి వివరించారు.