News August 25, 2025

విజయవాడలో పోలీసుల సైక్లింగ్ ర్యాలీ

image

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో ‘సండేస్ ఆన్ సైకిల్ విత్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్’ పేరుతో సైకిల్ ర్యాలీ జరిగింది. వ్యాస్ కాంప్లెక్స్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీని డీసీపీ ఎస్.వి.డి. ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, సంతోషకరమైన జీవనశైలి లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Similar News

News August 26, 2025

నేరాల నియంత్రణకు చిత్తశుద్ధితో కృషి చేయండి: ASF ఎస్పీ

image

నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. సోమవారం అసిఫాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఫింగర్ ప్రింట్ డివైజ్‌లను సంబంధిత ఎస్‌హెచ్ఓలకు అందజేశారు. నేరస్తులను గుర్తించడానికి ఈ డివైజ్ ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. నేరం జరిగిన వెంటనే పాత నేరస్తులను తీసుకువచ్చి ఈ డివైస్‌ల సహకారంతో గుర్తించాలన్నారు.

News August 26, 2025

‘తల్లికి వందనం పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారానికి చర్యలు’

image

జిల్లాలో తల్లికి వందనం పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తల్లికి వందనం ఖాతాలో నగదు జమ చేయడానికి ఇబ్బందిగా ఉన్న అంశాల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

News August 26, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 110 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 110 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.