News August 25, 2025

బాలకృష్ణ రికార్డు.. అభినందించిన పవన్

image

AP: సినీ నటుడు, MLA బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ‘స్వర్గీయ NTR నట వారసుడిగా 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. వైవిధ్యమైన చిత్రాలతో మెప్పిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన పద్మ భూషణ్ బాలకృష్ణకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 22, 2025

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఎల్లో అలర్ట్

image

AP: దక్షిణ అండమాన్ సముద్రం-మలక్కా మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 24న వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News November 22, 2025

నవజాత శిశువుల్లో మూర్ఛ

image

సాధారణంగా మూర్ఛ చిన్నవయసులో/ 60ఏళ్లు పైబడిన వారికి ఎక్కువగా వస్తుంటుంది. కానీ కొన్నిసార్లు నవజాత శిశువులకూ మూర్ఛ వస్తుందంటున్నారు నిపుణులు. దీన్నే నియోనాటల్ మూర్ఛ అంటారు. దీనివల్ల భవిష్యత్తులో ఎదుగుదల లోపాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా లక్షలో ఒకరిని ప్రభావితం చేస్తాయి. దీని సంకేతాలు సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి చిన్నారి కదలికలు అసాధారణంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News November 22, 2025

నవజాత శిశువుల్లో మూర్ఛ లక్షణాలు

image

చిన్నారి కదలికలు ఆకస్మికంగా ఆగిపోవడం, చూపులు కొద్దిగా ప్రక్కకు ఉండటం, చేతులు, కాళ్ళు ఆపకుండా లయ పద్ధతిలో కదిలించడం, మోచేతులను చాలాసేపు వంచి, పొడిగించి గట్టిగా ఉంచినట్లు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. శిశువుల్లో మూర్ఛ రావడానికి ప్లాసెంటల్ అబ్రక్షన్, సుదీర్ఘ ప్రసవం, ప్రసవానికి ముందు లేదా ఆ తరువాత సమయంలో ఆక్సిజన్ లేకపోవడం, వివిధ రకాల ఇన్ఫెక్షన్లు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.