News April 2, 2024

రిషి సునాక్‌కు మెగా పోల్ షాక్

image

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు సివిల్ సొసైటీ ప్రచార సంస్థ మెగా పోల్ షాక్ ఇచ్చింది. అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేసింది. 15,029మందిపై ఈ పోల్‌ను నిర్వహించారు. అధికార పార్టీతో పోలిస్తే ప్రతిపక్ష లేబర్ పార్టీ 19పాయింట్ల ఆధిక్యంలో ఉందని, 286 సీట్ల మెజారిటీ సాధిస్తుందని జోస్యం చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 250 చోట్ల అధికార పార్టీ ఓడిపోతుందని తెలిపింది.

Similar News

News February 8, 2026

ఆపరేషన్ సిందూర్ దెబ్బ.. ఇంకా కోలుకోని పాక్!

image

గతేడాది పాక్‌లోని ఉగ్ర శిబిరాలు, వైమానిక స్థావరాలపై ‘<<16454711>>ఆపరేషన్ సిందూర్<<>>’తో భారత్ విరుచుకుపడటం తెలిసిందే. 10 నెలలవుతున్నా పాక్ కోలుకున్నట్లు లేదు. అక్కడి భోలారీ హాంగర్‌ను ఇంకా రిపేర్ చేసుకోలేదు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను NDTV బయటపెట్టింది. ధ్వంసమైన రూఫ్‌ను తొలగించినట్లు తెలిపింది. మురిద్‌లో టార్పాలిన్ కప్పి పనులు చేస్తున్నారని, సుక్కుర్, నూర్ ఖాన్ బేస్‌లోనూ రిపేర్లు చేస్తున్నట్లు చెప్పింది.

News February 8, 2026

వాలంటైన్స్ డే.. భారీగా హోటల్ రూమ్ బుకింగ్స్

image

‘వాలంటైన్స్ డే’ అంటే ఒకప్పుడు పార్కులు, రెస్టారెంట్లలో సందడి నెలకొనేది. ఇప్పుడు ప్రేమజంటలు హోటల్ స్టేలకు మొగ్గు చూపుతున్నాయి. ఈ feb14కు గతేడాదితో పోలిస్తే హోటల్ బుకింగ్స్ 175% పెరిగాయని ట్రావెల్ సంస్థలు అంటున్నాయి. గువాహటి, కొలంబో, ఆగ్రా, జైపూర్, గోవా, మనాలి తదితర ప్రాంతాలకు డిమాండ్ అధికమని వెల్లడించింది. స్టేతో పాటు ప్రైవేట్ పార్టీలు, లంచ్-డిన్నర్ తదితర ఎక్స్‌పీరియన్స్‌ ప్రిఫర్ చేస్తున్నారట.

News February 8, 2026

BPNSIలో రూ. లక్షన్నర జీతంతో ఉద్యోగాలు

image

<>బిజు పట్నాయక్<<>> నేషనల్ స్టీల్ ఇన్‌స్టిట్యూట్ (BPNSI) 5 ట్రైనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ME/MTech(మెకానికల్, మెటలర్జీ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), BE/BTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 20 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.1,50,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.bpnsi.org