News August 25, 2025
KMM: ఉపాధ్యాయ పదోన్నతుల జాబితా సిద్ధం

ఖమ్మం జిల్లాలో ఎస్టీల నుంచి ఎస్ఏ(స్కూల్ అసిస్టెంట్లు)లుగా పదోన్నతి పొందే వారి జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలో 1: 3 నిష్పత్తిలో సుమారు 600 మంది ఎస్టీలు ఉండగా 1:1 నిష్పత్తిలో వివిధ సబ్జెక్ట్‌లు సంబంధించి 207 మందితో తుది జాబితా తయారు చేశారు. కాగా ఈరోజు ఈ 207 మందికి వెబ్ ఆప్షన్లు మొదలుకానున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Similar News
News August 25, 2025
జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా మహమ్మద్ ముజాహిద్

ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా సోమవారం మహమ్మద్ ముజాహిద్ భాద్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. ఈ సందర్భంగా మైనార్టీ సంక్షేమ అధికారికి జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
News August 25, 2025
విగ్రహం తరలించే రూట్ మ్యాప్ ఫైనల్ చేసుకోవాలి: సీపీ

నిమజ్జనం రోజు ఊరేగింపు కార్యక్రమం, చివరి పూజ సూర్యాస్తమం కంటే ముందే ప్రారంభించాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సీపీ సునీల్ దత్ సూచించారు. నిమజ్జనం నాడు విగ్రహం తరలించే వాహనాలు ముందుగా బుక్ చేసుకోవాలని, విగ్రహం తరలించే రూట్ మ్యాప్ ఫైనల్ చేసుకోవాలని చెప్పారు. వినాయక మండపం సమీపంలో ఎక్కడైనా మద్యం బెల్ట్ షాపు ఉంటే, అబ్కారీ శాఖ అధికారులు కట్టడి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
News August 25, 2025
ప్రతి గణేష్ మండపానికి ఉచిత విద్యుత్: జిల్లా కలెక్టర్

ప్రతి గణేష్ మండపానికి లైన్‌మెన్ ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇస్తారని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్ శ్రీజ, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా వైభవోపేతంగా జరగాలని అధికారులను ఆదేశించారు.