News August 25, 2025
ఎకో ఫ్రెండ్లీ బయో అర్బన్ సిటీగా HYD: కమిషనర్

GHMC అద్భుతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు కమిషనర్ కర్ణన్ తెలిపారు. ఎకో ఫ్రెండ్లీ బయో అర్బన్ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ, రూఫ్ టాప్ సోలార్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నూతన ప్రాజెక్టులు, 4 చోట్ల C&D వేస్ట్ ప్లాంట్లు, 25 లక్షల మొక్కలు, 300 పార్కులు, మెట్రో, 300 పైగా ఎలక్ట్రిసిటీ బస్సులు నడిపిస్తునామన్నారు.
Similar News
News August 26, 2025
తిమ్మాయపాలెంలో 22అడుగుల గణనాథుడు

బాపట్ల జిల్లాలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాన్ని అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకురావడానికి అధిక మొత్తంలో ఖర్చైందని నిర్వాహకులు తెలిపారు. దీని ఖరీదు అక్షరాలా 1.5లక్షలు అన్నారు. ఈ విగ్రహాన్ని గ్రామంలోని ఓ యువకుడు అందజేశాడు. తొమ్మిది రోజుల ఈ పాటు వినాయకుడు పూజలందుకోనున్నారన్నారు.
News August 26, 2025
పెద్దపల్లి: ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ

పెద్దపల్లి మండలం పెద్దకల్వలలో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులు, స్టాఫ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లోని అన్ని వసతులను పరిశీలించారు. వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్ డైట్ మెనూ పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
News August 26, 2025
వైద్య రంగంలో ఆవిష్కరణల కోసం కార్యక్రమాలు: చంద్రబాబు

AP: అంతర్జాతీయ బయోడిజైన్ నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వైద్యారోగ్య రంగంలో పరిశోధన, శిక్షణ, స్టార్టప్‌ల కోసం వీరితో MOU చేసుకున్నారు. ప్రజారోగ్య రంగంలో ఆవిష్కరణలకు భారత్ బయో డిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్(BRAIN) చేపడతామని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో అంతర్భాగంగా ఈ రీసెర్చ్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఏఐ, మెడ్‌టెక్ అలయన్స్ ఫౌండేషన్-స్టాన్‌ఫోర్డ్ సహకారంతో ముందుకెళ్తామని ఆయన చెప్పారు.