News August 25, 2025
వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్!

పండగ డిమాండ్ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి GST కొత్త శ్లాబ్స్ అమలు కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 3,4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. GSTని సరళీకరిస్తూ అన్ని వస్తువులపై ట్యాక్స్‌ను రెండు శ్లాబ్స్(5%, 18%)కు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. మీటింగ్‌లో చర్చించి వీటిపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. అయితే లగ్జరీ వస్తువులకు మాత్రం 40% GST ఉండనుంది.
Similar News
News August 25, 2025
ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ

దేశ వ్యాప్తంగా 14 మంది హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇందులో ముగ్గురు న్యాయమూర్తులను ఏపీకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. గుజరాత్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ డి.రమేశ్, కలకత్తా హైకోర్ట్ జడ్జి జస్టిస్ సుభేందు సమంత ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
News August 25, 2025
ఫిజి క్రికెట్ టీమ్‌లకు ఇండియన్ కోచ్: PM మోదీ

ఫిజి దేశానికి చెందిన క్రికెట్ జట్లకు ఇండియన్ కోచ్ త్వరలో శిక్షణనిస్తారని PM మోదీ ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన ఫిజి ప్రధాని సితివేణి రబుకతో ఆయన భేటీ అయ్యారు. ‘క్రీడలు ప్రజలను గ్రౌండ్ నుంచి మైండ్ దాకా కనెక్ట్ చేస్తాయి. ఫిజిలో రగ్బీ, INDలో క్రికెట్ దానికి ఉదాహరణ. గతంలో IND రగ్బీ జట్టుకు ఫిజి కోచ్ శిక్షణనిచ్చారు’ అని గుర్తు చేశారు. కాగా ICCలో ఫిజి అసోసియేట్ మెంబర్‌గా ఉంది.
News August 25, 2025
కేటీఆర్.. అప్పుడు మీ దమ్ముకు ఏమైంది?: MP కిరణ్

TG: పార్టీ మారిన MLAలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అంటూ KTR విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ MP చామల కిరణ్ కౌంటరిచ్చారు. ‘పదేళ్లలో 60 మంది MLAలు పార్టీ మారితే అప్పుడు మీ దమ్ముకు దుమ్ము పట్టిందా? మీరు HYDలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలిచినా పార్లమెంట్‌లో సున్నా వచ్చింది’ అని అన్నారు. BJPని విమర్శిస్తూ ‘కేంద్రం చంద్రబాబుకు ఇచ్చే ఇంపార్టెన్స్ BJP MPలకు ఇవ్వడం లేదు’ అని వ్యాఖ్యానించారు.