News August 25, 2025

జగిత్యాలలో వైభవంగా గణేశ్ ఆగమనాలు..!

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గణేశ్ ఆగమనాలు భారీగా సాగుతున్నాయి. పండక్కి 2 రోజుల సమయమే ఉండటంతో నిర్వాహకులు ట్రాఫిక్ రద్దీ, ఇతరత్రా కారణాలతో ప్రతిమలను ముందే మండపాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా భారీ సైజ్ గణనాథులు వారంరోజుల ముందుగానే మండపాలకు చేరుకున్నాయి. ఇంకొన్ని చేరుకుంటున్నాయి. కాగా, ఈసారి చవితి ఉత్సవాల కోసం పోలీసు శాఖ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఉత్సవాలు శాంతియుతంగా సాగేలా ప్రజలు కూడా సహకరించాలి.

Similar News

News August 26, 2025

జగిత్యాల: ‘ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించాలి’

image

జగిత్యాల జిల్లా ఆర్మ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్ గా వెంకట్ రావు పదోన్నతి పొందారు. నేడు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ హెడ్ కానిస్టేబుల్‌కు పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేశారు. పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంపొందించాలన్నారు.

News August 26, 2025

పీఎం మోదీ డిగ్రీ వివరాలు కూడా వ్యక్తిగత సమాచారమే: ఢిల్లీ హైకోర్టు

image

ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తుల అకడమిక్ వివరాలు కూడా వ్యక్తిగత సమాచారమేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. PM మోదీ, స్మృతి ఇరానీ విద్యార్హత వివరాలను వెల్లడించాలని <<17514311>>RTI దాఖలవడంపై<<>> విచారణ జరిపింది. ‘వర్సిటీలు విద్యార్థులకు తప్ప ఇతరులకు మార్కులను బహిర్గతం చేయలేవు. మోదీ, స్మృతి విద్యార్హతలను వెల్లడించడంలో ప్రజాప్రయోజనం లేదు. RTI చట్టంలోని సెక్షన్ 8(1)(j) దీనికి మినహాయింపునిస్తుంది’ అని తెలిపింది.

News August 26, 2025

జగిత్యాల: బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ

image

పోలీసులకు ఫిర్యాదు చేసే బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం గ్రీవెన్స్ డేలో భాగంగా 15 మంది అర్జీదారులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను ఫోన్లో సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులకు భరోసా కల్పించి, న్యాయం జరిగేలా చూడటమే గ్రీవెన్స్ డే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.