News August 25, 2025
ఓయూకు చేరుకున్న సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర సీఎం ఓయూకు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన పర్యటన నేపథ్యంలో నిరసనకు దిగుతారన్న సమాచారంతో బీఆర్ఎస్వీ, ఏబీవీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వర్సిటీ పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
Similar News
News August 25, 2025
వికలాంగుల పెన్షన్లు రద్దు చేయలేదు: మంత్రి పయ్యావుల

AP: వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఖండించారు. ‘కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చాం. 40% పైబడి అంగవైకల్యం ఉన్న వారికే పెన్షన్లు ఇస్తాం. నోటీసులు అందుకున్న వారు మెడికల్ బోర్డు దగ్గర తమ వైకల్యం నిరూపించుకోవాలి. మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్లు అందిస్తాం’ అని స్పష్టం చేశారు. అటు SEP 6న అనంతపురంలో CM CBN పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.
News August 25, 2025
ఇన్‌స్టా చూడటమే ఉద్యోగం!

కొందరు ఎక్కువసేపు సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారికి ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఒకటుంది. ముంబైకి చెందిన మాంక్ ఎంటర్టైన్మెంట్ ‘డూమ్ స్క్రోలర్’ పేరిట ఉద్యోగ అవకాశాన్ని ఇస్తోంది. సదరు ఉద్యోగి ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కనీసం 6 గంటల సమయం గడుపుతూ ట్రెండింగ్ అంశాలు, వైరల్ కంటెంట్‌ను గుర్తించాలి. వీరికి హిందీ & ఇంగ్లిష్ వచ్చి ఉండాలి.
News August 25, 2025
ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

AP: వైద్యారోగ్యశాఖలో 185 డాక్టర్ల నియామకానికి ప్రభుత్వం <