News August 25, 2025
‘AA22’లో యాక్షన్ సీన్స్‌కు గూస్‌బంప్స్ పక్కా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తోన్న ‘AA22’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ బన్నీ కెరీర్‌లో హైలైట్‌గా నిలుస్తాయని సినీవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుందని సమాచారం. అలాగే ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News August 25, 2025
వికలాంగుల పెన్షన్లు రద్దు చేయలేదు: మంత్రి పయ్యావుల

AP: వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఖండించారు. ‘కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చాం. 40% పైబడి అంగవైకల్యం ఉన్న వారికే పెన్షన్లు ఇస్తాం. నోటీసులు అందుకున్న వారు మెడికల్ బోర్డు దగ్గర తమ వైకల్యం నిరూపించుకోవాలి. మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్లు అందిస్తాం’ అని స్పష్టం చేశారు. అటు SEP 6న అనంతపురంలో CM CBN పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.
News August 25, 2025
ఇన్‌స్టా చూడటమే ఉద్యోగం!

కొందరు ఎక్కువసేపు సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారికి ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఒకటుంది. ముంబైకి చెందిన మాంక్ ఎంటర్టైన్మెంట్ ‘డూమ్ స్క్రోలర్’ పేరిట ఉద్యోగ అవకాశాన్ని ఇస్తోంది. సదరు ఉద్యోగి ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కనీసం 6 గంటల సమయం గడుపుతూ ట్రెండింగ్ అంశాలు, వైరల్ కంటెంట్‌ను గుర్తించాలి. వీరికి హిందీ & ఇంగ్లిష్ వచ్చి ఉండాలి.
News August 25, 2025
ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

AP: వైద్యారోగ్యశాఖలో 185 డాక్టర్ల నియామకానికి ప్రభుత్వం <