News April 2, 2024

తిరుపతి: SPMVVలో రేపటి నుంచి ఒంటిపూట తరగతులు

image

శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో బుధవారం నుంచి ఒంటిపూట తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రిజిస్ట్రార్ రజినీ ఆదేశాలు జారీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 30 వరకు తరగతులు ఉంటాయని, పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.

Similar News

News March 7, 2026

మృత్యుంజయ స్వామిని దర్శించుకున్న జడ్జి అరుణ

image

చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక శనివారం చౌడేపల్లి మండలంలోని పలు దేవాలయాలను సందర్శించారు. తొలుత స్థానిక శివాలయంలో మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బోయకొండ గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. శివాలయంలో అర్చకులు, బోయకొండలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం న్యాయమూర్తిని సాదరంగా ఆహ్వానించి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు.

News March 7, 2026

లింగ నిర్ధారణ చట్టం పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

image

అన్నమయ్య జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం పక్కగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లె కలెక్టరేట్లోని కోర్టు హాల్లో లింగ నిర్ధారణ నిషేధ చట్టం, ప్రసూతి మరణాలపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. లింగ నిర్ధారణ, అబార్షన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై విస్తృత అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

News March 7, 2026

చిత్తూరు: కార్పొరేట్ ఉచిత విద్యకు 10 వరకే గడువు

image

విద్యాహక్కు చట్టం ప్రకారం పేద, మధ్యతరగతి వర్గాల వారు ఉచితంగా కార్పొరేట్ విద్య అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఇందుకోసం విద్యాసంస్థలు 25% సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రవేశానికి తగిన సర్టిఫికేట్లతో సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడువు మార్చి 10 వరకు మాత్రమే ఉంది. లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారు.